Sankranti Akumanam : విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మొదటి రోజు ఓపెనింగ్ దగ్గర నుండి, ఆ తర్వాత రోజు నుండి వస్తున్న వసూళ్ల వరకు ప్రతీ ఒక్కటి ఈ సినిమా ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసే నంబర్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. నిర్మాతలు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి నాలుగు రోజులకు గాను 131 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి గ్రాస్ వసూళ్లు మొదటి వారం లోపు రావడం మనం చూసాము. మొట్టమొదటిసారి ఒక సీనియర్ హీరో కి ఇప్పుడు ఇలాంటి వసూళ్లు చూస్తున్నాము.
అదే విధంగా ఈ చిత్రానికి నాల్గవ రోజు దాదాపుగా 11 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిన్నట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో 56 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. గత రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా వెంకటేష్ కి కనీసం 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమా కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వారం తిరగకముందే తెలుగు రాష్ట్రాల నుండి 56 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు. వరల్డ్ వైడ్ గా తీసుకుంటే దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. వరుసగా నాలుగు రోజుల నుండి ఈ సినిమాకి డబుల్ డిజిట్ షేర్ వసూళ్లు వస్తున్నాయి. ఊపు చూస్తుంటే మొదటి వారంలోనే వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునేలా అనిపిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఫుల్ రన్ లో 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అనేక ప్రాంతాలలో #RRR , పుష్ప 2 రికార్డ్స్ కూడా బద్దలు అవుతాయట. ‘దేవర’, ‘సలార్’ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో 125 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాయి. ఇవి ఇప్పుడు డేంజర్ జోన్ లో పడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఈమధ్య కాలం లో సూపర్ హిట్ సినిమాలకు నెల రోజులకు పైగా థియేట్రికల్ రన్ దక్కుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఊపు చూస్తుంటే అదే రేంజ్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే కనుక జరిగితే విక్టరీ వెంకటేష్ అభిమానులు సంబరాలు చేసుకోవచ్చు. రెండు దశాబ్దాల రికార్డ్స్ ఆకలి మొత్తం తీరిపోయినట్టే. చూడాలి మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది.