Sankranthiki Vastunnam : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రభంజనం సృష్టించిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అయితే ఈమధ్య కాలంలో ప్రతీ సినిమా నాలుగు వారాల థియేట్రికల్ రన్ అవ్వగానే ఓటీటీ లో విడుదల అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మాత్రం ఈ ట్రెండ్ కి భిన్నంగా ఓటీటీ కంటే ముందు టీవీ టెలికాస్ట్ కాబోతుంది. నేడు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కాబోతుంది. ఈ చిత్రం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జీ తెలుగు ఛానల్ కూడా ఈ సినిమా పై చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే ఈమధ్య కాలంలో టీఆర్ఫీ రేటింగ్స్ విషయంలో జీ తెలుగు బాగా వెనుకబడింది.
Also Read : ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీవీ టెలికాస్ట్ తేదీని ప్రకటించిన మూవీ టీం..ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడంటే!
బ్లాక్ బస్టర్ సినిమాలను టెలికాస్ట్ చేసినా, కొత్త సీరియల్స్ ని అందుబాటులోకి తెచ్చిన పని అవ్వడం లేదు. ఇటీవలే ప్రభాస్(Rebel Star Prabhas) ‘కల్కి'(Kalki 2898AD), నాని(Natural Star Nani) ‘సరిపోదా శనివారం'(Saripodha Sanivaram Movie) చిత్రాలను టెలికాస్ట్ చేసారు.ఈ రెండు సినిమాలు కూడా టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో దారుణంగా దెబ్బ కొట్టాయి. రెండిటికి 5 కి మించి రేటింగ్స్ రావడం లేదు. జీ తెలుగు ఛానల్ బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న చివరి చిత్రం ‘వకీల్ సాబ్’. సుమారుగా 20 టీఆర్ఫీ రేటింగ్స్ ఆ చిత్రానికి వచ్చాయి. ఆ తర్వాత విడుదలైన సినిమాలు దేనికి కూడా పది రేటింగ్స్ దాటలేదు. నేడు టెలికాస్ట్ కాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జీ తెలుగు లో ఆల్ టైం రికార్డు నెలకొల్పుతుందని బలమైన నమ్మకంటే తో ఉన్నారు. ఇదే రోజున ఈ సినిమా జీ 5 యాప్ లోకి కూడా అందుబాటులోకి రానుంది.
సాధారణంగా శనివారం రోజున కూడా సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కోసం వాటిని నేడు రద్దు చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు అనేది. కానీ శనివారం కంటే, ఆదివారం రోజున ఈ సినిమాని టెలికాస్ట్ చేసి ఉంటే గురి తప్పకుండా రికార్డ్స్ ని క్రియేట్ చేసేదని పలువురి అభిప్రాయం. చూడాలి మరి ఏ రేంజ్ లో ఈ చిత్రం టీఆర్ఫీ రేటింగ్స్ ని కొల్లగొట్టబోతుంది అనేది.