Sankranthiki Vastunnam : విక్టరీ వెంకటేష్(victory venkatesh) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) చిత్రం డ్రీం రన్ దాదాపుగా ముగిసినట్టే. ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఒక కేస్ స్టడీ లాంటిది. వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ తగిలితే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం షేక్ అవుతాయి అని మరోసారి నిరూపించిన సినిమా. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లు వస్తున్నాయి కానీ , మెజారిటీ ప్రాంతాల్లో షేర్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. ఇది నిర్మాతల అత్యుత్సాహమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓటీటీ కంటే ముందుగా టీవీ టెలికాస్ట్ చేయబోతున్నామంటూ ప్రతీ రోజు జీ తెలుగు ఛానల్ లో ప్రకటనలు ఇస్తూ వచ్చారు. త్వరలో టెలికాస్ట్ అయిపోతుంది కదా, థియేటర్ కి వెళ్లి చూసి డబ్బులెందుకు వృధా చేసుకోవడం అనే ధోరణి అనేక మందిలో ఏర్పడి ఉండొచ్చు.
అందుకే 50 రోజులు గ్యాప్ లేకండా షేర్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమా 35 రోజులకే క్లోజింగ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాతలు ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు బాగా ప్రచారం చేసారు కానీ, వాస్తవానికి ట్రేడ్ లెక్కల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 160 కోట్ల రూపాయిల షేర్, 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం పది కోట్ల రూపాయిలు రాబట్టి ఉంటే నిర్మాతలు ప్రచారం చేసిన 300 కోట్ల గ్రాస్ నిజమయ్యేది. ఆ చిన్న టార్గెట్ మిస్ అయ్యినందుకు ఎక్కడో అభిమానుల్లో చిన్న అసంతృప్తి. ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం లో 43 కోట్ల రూపాయిలు, సీడెడ్ లో 19 కోట్ల 10 లక్షలు, ఉత్తరాంధ్ర లో 23 కోట్లు, ఉభయగోదావరి జిల్లాలకు కలిపి పాతిక కోట్ల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 11 కోట్లు, కృష్ణ జిల్లాలో 9 కోట్ల 70 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా ఓవర్సీస్ లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇలా ప్రతీ ప్రాంతంలోనూ పెట్టిన ప్రతీ పైసాకి బయ్యర్స్ కి మూడు రూపాయిల లాభం మిగిలింది. చాలా అరుదుగా ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తగులుతూ ఉంటాయి. ఆ లిస్ట్ లోకి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం చేరడం సంతోషించదగ్గ విషయం. ఈ ఏడాది ఆరంభం అదిరింది, రాబోయే రోజుల్లో ఏ రేంజ్ ఇదే తరహా జోష్ మన సినీ పరిశ్రమ కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా పై ఉత్కంఠ నెలకొంది. అందుకే ఆయన తదుపరి చిత్రం ఎంపిక పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.