Sankranthi Movies 2026: ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే చాలు స్టార్ హీరోల సినిమాలు థియేటర్ల దగ్గర సందడి చేస్తుంటాయి. కొన్ని చిన్న సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంటాయి. కంటెంట్ బాగున్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు…గతంలో చాలా సందర్భాల్లో పెద్ద హీరోలతో పోటీపడిన చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా డిజాస్టర్ల బాట పట్టిన సందర్భాలు సైతం లేకపోలేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ‘మన శంకర్ వరప్రసాద్’, ‘రాజాసాబ్’ సినిమాలకు పోటీగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇందులో నారీ నారీ నడుమ మురారి సినిమా కంటెంట్ బాగున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా టీజర్ ని కనక మనం చూసినట్లయితే సినిమాలో కన్ఫ్యూజన్ డ్రామా ను క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. శర్వానంద్ మొదటి సారి ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ లో నటించడం విశేషం…ఈ సినిమా డైరెక్టర్ అయిన రామ్ అబ్బరాజు సైతం ఇంతకుముందు సమాజవరగమన అనే సినిమా చేశాడు.
ఈ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి ఒక డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు మరోసారి పెరిగిపోయాయి. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో కంటెంట్ బాగుందని అందువల్లే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులు సైతం వాళ్లభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్ లో ఉన్న శర్వానంద్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే తన కెరీర్ అనేది ముందుకు సాగుతోంది. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు అంటూ చాలా మంది సినిమా మేధావులు అతన్ని హెచ్చరిస్తున్నారు…