Bigg Boss 9 Telugu Sanjjanaa Galrani : ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 9 నేడు మొదలైపోయింది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ ఒకరిని మించి ఒకరు ఉన్నారు. ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం లాగా అనిపిస్తున్నారు అందరూ. అయితే సంజన గల్రాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె ప్రభాస్ బుజ్జి గాడు చిత్రం ద్వారా మన ప్రేక్షకులందరికీ పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు లో అనేక సినిమాలు చేసింది, మంచి గుర్తింపుని తెచ్చుకుంది. కానీ కన్నడ లో మాత్రం మంచి హీరోయిన్ గా స్థిరపడింది. నిన్న మొన్నటి వరకు కూడా సినిమాలు చేస్తూ బిజీ గా ఉండేది. అంతే కాదు ఈమె కన్నడ బిగ్ బాస్ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది.
అయితే కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు ఈమె మలకద్రవ్యాలు సేవించింది అనే ఆరోపణతో అరెస్ట్ అయ్యింది. దాదాపుగా మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది అట. అయితే వాదనలు మొత్తం పూర్తిగా విన్న తర్వాత హై కోర్టు ఈమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ ఆ విషయం జనాల్లోకి మాత్రమే కాదు, ఇండస్ట్రీ లో కూడా సరిగా వెళ్ళలేదు. దీంతో ఆమె కెరీర్ లో ఎప్పుడూ చూడనంత డౌన్ ఫాల్ ని చూసింది. కానీ కన్నడ బిగ్ బాస్ షో ద్వారా తన క్యారక్టర్ ఎలాంటిదో నిరూపించి మళ్లీ సినీ ఇండస్ట్రీ లో బిజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి వచ్చింది. ఇక్కడ ఆమె ఎన్ని రోజులు నెగ్గుకురాగలదో చూడాలి. మన ఆడియన్స్ ఈమెని నచ్చుతారో లేదో కూడా చూడాలి.