Bigg Boss 9 Suman Shetty : ఒకప్పుడు కమెడియన్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన నటుడు సుమన్ శెట్టి. తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన సుమన్ శెట్టి, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు భోజ్ పూరి భాషలకు కలిపి 300 సినిమాలకు పైగా చేసాడు. ఈమధ్య కాలం లో కాస్త నెమ్మదించిన సుమన్ శెట్టి బిగ్ బాస్ 9 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. చూసేందుకు చాలా పొట్టిగా కనిపిస్తున్న ఈయన హౌస్ లోపలకు వెళ్లిన తర్వాత ఈమేరకు ఫిజికల్ టాస్కులు ఆడగలడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హౌస్ లో ఒక్కొక్కరిని చూస్తుంటే బుల్లెట్స్ లాగా ఉన్నారు. మరి వాళ్ళను సుమన్ శెట్టి తట్టుకోగలడా?, చూస్తుంటే మనిషి కూడా చాలా సున్నితంగానే అనిపిస్తున్నాడు. మరి ఇతను ఎంతవరకు నెగ్గుకురాగలడు? అనేది అందరిలో కలుగుతున్న ప్రశ్న.
అయితే మిగిలిన కంటెస్టెంట్స్ కి దక్కిన గౌరవం, మర్యాద ఎందుకో సుమన్ శెట్టి కి దొరకలేదని అనిపిస్తుంది. ముఖ్యంగా అగ్నిపరీక్ష షో ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియా శెట్టి, లోపలకు వచ్చిన తర్వాత అందరినీ పలకరించింది కానీ, సుమన్ శెట్టి ని పలకరించలేదు. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇతన్ని కంటెస్టెంట్స్ చాలా తక్కువ అంచనా వేసేలాగా ఉన్నారు. గతం లో పల్లవి ప్రశాంత్ ని ఇదే విధంగా తక్కువ అంచనా వేసి అతని చేతిలో కప్పు పెట్టి పంపారు. ఇప్పుడు సుమన్ శెట్టి విషయం లో కూడా అదే జరగబోతుందా లేదా అనేది చూడాలి.