Sanjeev Kumar had already predicted his death know the reason
Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వస్తే పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందవచ్చు. ఒకప్పుడు, ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశం కోసం కొందరు ఇతర సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఆరాపడుతూ ఉంటారు. అయితే హిందీ పరిశ్రమలో అవకాశం వచ్చినా.. ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ స్టార్ కావడం మరీ కష్టం. కానీ ఓ హీరో తన నటన ద్వారా అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చూడకుండా ఉండేవాళ్లు కాదు. అయితే ఈ హీరో కుటుంబంలో నిత్యం విషాదాలు అలుముకుంటున్నాయి. అవెంటో తెలుసా?
బాలీవుడ్ ఇండస్ట్రీ ఒకప్పుడు స్వర్ణయుగమనే చెప్పాలి. దీంతో అలనాటి హీరోలు రారాజుగా బతికేవారు. మంచి మంచి సినిమాల్లో నటించి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సంజీవ్ కుమార్ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సంజీవ్ కుమార్ హీరో అంటే ఇష్టం లేని వారు ఉండరు. స్మగ్లర్, కలాపి, రాజ్ ఔర్ రంక్, అలీబాబా ఔర్ 40 చోర్, అంగూర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ హీరో అయ్యారు. సంజీవ్ కుమార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం ఉండేది.
సంజీవ్ కుమార్ హీరోగానే కాకుండా వివిధ పాత్రల్లో కనిపించేవారు. వీటిలో ముఖ్యంగా వృద్ధాప్య పాత్రల్లో కనిపించేవారు. అయితే కొందరు తనను ఇంత చిన్న వయసులోనే వృద్ధాప్య పాత్రల్లో ఎందుకు నటిస్తున్నారు? అని అడగగా.. తన వృద్ధాప్యం తాను చూసుకోలేనని చెప్పేవారు. ఆయన చెప్పిన విధంగానే సంజీవ్ కుమార్ 47 ఏళ్ల వయసులో ఉండగానే అనారోగ్యంతో మరణించారు. దీంతో సినీ ఇండస్ట్రీ షాక్ కు గురైంది.
అయితే విషాదమేంటంటే సంజీవ్ కుమార్ ఇంట్లో ఎవరూ 50 ఏళ్లకు మించి ఎవరూ బతకలేదు. అయితే ఇది దోషమా? లేక ఇంకేమైనా ఉంటుందా? అని అనుకుంటున్నారు. అయితే సంజీవ్ కుమార్ మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్నన్నాళ్లు మాత్రం సక్సెస్ సినిమాలు తీసి ప్రత్యేక గుర్తింపు సాధించారు.