Bigg Boss 9 Telugu Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి ఎపిసోడ్ నుండి నేటి ఎపిసోడ్ వరకు ఆసక్తికరమైన టాస్కులతో, ఎవ్వరూ ఊహించని ట్విస్టులతో, బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ప్రతీ ఎపిసోడ్ కి అదిరిపోతున్నాయి. అయితే ఈ సీజన్ బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేయడానికి ముఖ్య కారణాలలో ఒకరు సంజన. గేమ్ ని బాగా అర్థం చేసుకొని హౌస్ లో దుమ్ము లేపుతున్న కంటెస్టెంట్స్ లో ఒకరు. గొడవ పడాల్సిన సమయం లో గొడవపడుతోంది, టాస్కులు ఆడాల్సిన సమయం లో నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెడుతోంది, ఓవరాల్ గా మంచి గేమర్ గా ఆడియన్స్ నుండి మార్కులు కొట్టేసింది. అలాంటి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారంటే నమ్ముతారా?, కానీ నమ్మాలి, నిజంగానే ఆమెని బయటకు పంపేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేసారు మేకర్స్.
ఈ ప్రోమోలో మొన్న యాపిల్ ఫలాల్లో వచ్చిన ఎరుపు విత్తనాలు దొరికిన కంటెస్టెంట్స్ ని పిలిచి, మీరు ఇప్పటి వరకు ఎలాంటి టాస్క్ లో పాల్గొనలేదు కాబట్టి, మీకు ఒక పవర్ ఇస్తున్నాను, ఈ హౌస్ లో నుండి ఒకరిని బయటకు పంపేయాలి. ఆ ఒకరు ఎవరు అనేది మీరే నిర్ణయించుకొని చెప్పండి అని అంటాడు బిగ్ బాస్. మాస్క్ మ్యాన్ హరీష్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రాము రాథోడ్ మరియు భరణి ఈ టాస్క్ లో పాల్గొంటారు. వీళ్లంతా చర్చించుకొని సంజన ని ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నాము అంటూ బిగ్ బాస్ కి చెప్తాడు. అప్పుడు బిగ్ బాస్ సంజన ని ఎలిమినేట్ చేసి బయటకు పంపేస్తాడు. వెళ్లే ముందు సంజన కావాలని నన్ను టార్గెట్ చేసి పంపుతున్నారు, కానీ ఇది మీ నిర్ణయం కాబట్టి గౌరవించి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది.
హౌస్ లో గేమ్ ని మొదలుపెట్టి, ఇప్పటికీ బాగా ఆడుతున్న కంటెస్టెంట్ సంజన, ఆమెకు ఆడియన్స్ ఓటింగ్ కూడా బలంగానే ఉంది అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తొలగించడం ఏంటో, బిగ్ బాస్ కి బుర్ర పనిచేయడం లేదంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ తిట్టుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే సంజన ని ఎలిమినేట్ చేయలేదు. ఆమెని ఒక సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. సోమవారం రోజున నామినేషన్స్ ఎపిసోడ్ లో ఈమె గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది అని టాక్. ఇప్పటికే ఆమెని హౌస్ లోని సీక్రెట్ రూమ్ కి పంపేశారట. అది ఈరోజు ఎపిసోడ్ లోనే చూపిస్తారా..? లేదా వీకెండ్ ఎపిసోడ్ లో చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.