OG Movie Collection Day 2: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him Og) చిత్రం మొదటి రోజున 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించింది. మిడ్ వీక్ లో విడుదలైన సినిమా కాబట్టి, కచ్చితంగా రెండవ రోజున భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే నూన్ షోస్ వీక్ గానే మొదలయ్యాయి. కానీ మ్యాట్నీ షోస్ నుండి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అయితే చెప్పనవసరం లేదు. A సెంటర్స్ లో ఈ చిత్రం సంచలనాత్మక వసూళ్లను రెండవ రోజు కూడా నమోదు చేసుకున్నాయి, కానీ B,C సెంటర్స్ లో మాత్రం నేడు ఈ చిత్రానికి ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు అవ్వలేదు. ఈ సెంటర్స్ లో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండవ రోజున తెలుగు రాష్ట్రాల్లో 14 నుండి 15 కోట్ల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
నార్త్ అమెరికా లో రెండవ రోజున 5 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ ఓవర్సీస్ కలిపి కచ్చితంగా 7 నుండి 8 లక్షల గ్రాస్ ఉంటుందని, ఇండియన్ కరెన్సీ ప్రకారం మొత్తం మీద 8 కోట్ల గ్రాస్ వసూళ్లు, 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఓవర్సీస్ నుండి వస్తుందని అంటున్నారు. అదే విధంగా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు హిందీ వెర్షన్ వసూళ్లు కలిపి మరో మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, ఓవరాల్ గా రెండవ రోజున 21 నుండి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాకుండా, ఈ ఏడాది లో రెండవ రోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచిందని అంటున్నారు.
రేపు ఎల్లుండి వీకెండ్ కావడం తో కచ్చితంగా రెండవ రోజు కంటే భారీ నుండి అతి భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. పైగా రేపటి నుండి విద్యార్థులకు సెలవులు కావడం తో ఒక వారం రోజుల పాటు ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అవుతాయని, తద్వారా బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీల గా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఒకవేళ బ్రేక్ ఈవెన్ మార్కుని దాటితే 11 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లీన్ హిట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.