Sandhya Theatre Stampede Case: గత ఏడాది ఇదే నెలలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్తు తెలుగు ప్రజానీకాన్ని శోక సంద్రంలో ముంచేసింది. ‘పుష్ప 2′(Pushpa 2 Movie) ప్రీమియర్ షో ని చూసేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావడం, ఆయన్ని చూసేందుకు అభిమానులు ఎగబడడం వల్ల, పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం తో తొక్కిసలాట ఘటన జరిగి రేవతి, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడడం. గాయాలపైనా వాళ్ళిద్దరినీ హాసిపిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా, రేవతి మధ్యలోనే ప్రాణాలు వదిలేయడం, శ్రీతేజ్ పరిస్థితి విషమించడం వంటివి జరిగాయి. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని అరెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ లో అల్లు అర్జున్ ఆరోజు నడుచుకున్న వ్యవహారాన్ని వివరించడం, అందుకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వంటివి నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యాయి.
ఇప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు ఈ పీడకల లాంటి సంఘటన నుండి బయట పడలేదు. అయితే ఈ ఘటన జరిగిన ఏడాదికి అల్లు అర్జున్ పై అధికారికంగా పోలీసులు చార్జి షీట్ ఫైల్ చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ తో పాటు, 23 మంది పై అభియోగాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ని ఛార్జ్ షీట్ లో A11 ముద్దాయి గా చేర్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అల్లు అర్జున్ ని A11 గా అధికారికంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు ఆయన దురాభిమానుల ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. మీ వాడికి అధికారికంగా ఖైదీ బట్టలు ఇచ్చేశారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే ఈ ఘటన లో గాయపడిన శ్రీతేజ్ కి, అతని కుటుంబానికి అల్లు అర్జున్ ఆర్థికంగా ఆదుకున్న సంగతి తెలిసిందే.
రెండు కోట్ల రూపాయిలు ఇవ్వడమే కాకుండా, కుర్రాడి వైద్యానికి అయ్యే ఖర్చు కూడా తన సొంత డబ్బులతో పెట్టుకునేందుకు ముందుకొచ్చాడు. అయితే శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ దయనీయం గానే ఉంది. ప్రతీ నెల అతని చికిత్స కోసం ఆరు లక్షల రూపాయిలను ఖర్చు చేయాల్సి వస్తుందని అతని చెప్పుకొచ్చాడు శ్రీతేజ్ తండ్రి. ఇప్పటికీ శ్రీ తేజ్ మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడట. అంతే కాకుండా ఆహరం కూడా అతను పైప్ ద్వారా నే తీసుకోవాల్సి వస్తుంది. మరి శ్రీతేజ్ పూర్తి స్థాయిలో ఎప్పుడు కోలుకుంటాడో చూడాలి. ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటికీ శ్రీతేజ్ పరిస్థితి ఇలాగే ఉండడం దయనీయం.