Sandeep Vanga With Mahesh Babu: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆ తర్వాత రణ్బీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నా సందీప్… వీలైనంత తొందరగా ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక వచ్చే సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ఆయన ఇప్పటిదాకా దొరికిన ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తన తదుపరి సినిమా కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడట…
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
అర్జున్ రెడ్డి సినిమా ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ తర్వాత సెకండ్ సినిమానే ఆయన మహేష్ బాబు తో చేయాల్సింది. కొద్ది రోజుల పాటు మహేష్ బాబుకు సంబంధించిన కథ చర్చలను కూడా జరిపాడు. అయినప్పటికి ఆ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని రెడీ చేస్తున్నాడట.
స్పిరిట్ సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆలోపు మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమా కూడా పూర్తి అయిపోతోంది. కాబట్టి మహేష్ బాబు సైతం తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే విషయాన్ని ఇంకా కన్ఫామ్ చేయలేదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లోనే మహేష్ బాబు సినిమా చేసే అవకాశం ఉంది కాబట్టి అతని కోసం ఒక గొప్ప సబ్జెక్ట్ ని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక సందీప్ మంచి కథతో వస్తే మాత్రం మహేష్ బాబు తన సబ్జెక్టుని ఈజీగా ఓకే చేస్తారని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా సందీప్ చేసిన సినిమాలకు గొప్ప గుర్తింపైతే ఉంటుంది…