Prabhas And Maruthi: వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్(Rebel Star Prabhas), మొదటిసారి మారుతీ(Maruti) దర్శకత్వం లో నటించబోతున్నాడు అన్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఒక రేంజ్ లో నిరసన వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమానే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా మారింది. ఆ చిత్రమే ‘రాజా సాబ్'(Raja Saab Movie). ఈ చిత్రం నుండి టీజర్,ట్రైలర్ విడుదల అయ్యే వరకు అభిమానుల్లో చాలా తక్కువ అంచనాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సినిమా కంటెంట్ గురించి ఆడియన్స్ కి , ఫాన్స్ కి ఒక అవగాహనా వచ్చిందో, అప్పటి నుండి ఈ సినిమాపై క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ ఈ చిత్రానికి తెచ్చిపెట్టిన క్రేజ్ మామూలుది కాదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం తెలుగు రాష్ట్రాలకే 180 కోట్ల రూపాయలకు పైగా జరిగింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ట్రేడ్ లో ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
ప్రభాస్ తో ఏ డైరెక్టర్ కూడా చేయించని రేంజ్ కామెడీ ని మారుతీ ఈ సినిమాలో చేయించాడట. ప్రభాస్ చివరిసారిగా కామెడీ చేసిన చిత్రం ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’. ఆ తర్వాత ఆయన కామెడీ జానర్ సినిమాలకు బాగా దూరం అయ్యాడు. బాహుబలి తో పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత ఆ జానర్ వైపు చూడాలని కూడా అనుకోలేదు ప్రభాస్. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ‘రాజా సాబ్’ చిత్రం చేసాడు. ఈ సినిమా షూటింగ్ సమయం లో ప్రభాస్ కి మారుతీ డైరెక్షన్ స్కిల్స్ బాగా నచ్చాయి. అందుకే మరోసారి అతనితో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఈసారి కామెడీ జానర్ తో రావడం లేదట. బాహుబలి లాంటి పీరియడ్ సబ్జెక్టు తో రాబోతున్నాడట.
కేవలం స్టోరీ లైన్ ని మాత్రమే వినిపించారని, అది ప్రభాస్ కి చాలా బాగా నచ్చిందని, ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రమ్మని ప్రభాస్ కి చెప్పినట్టు సమాచారం. ఇది నిజ జీవితం లో జరిగిన ఒక హిస్టారికల్ సబ్జెక్టు అని తెలుస్తుంది. నిజమైన హిస్టారికల్ సబ్జెక్టు అంటే ఏ రాజు గురించి చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.అందుతున్న సమాచారం ప్రకారం చరిత్రలో నిలిచిన ఓ కామెడీ రాజు కథను ఇతివృత్తంగా తీసుకొని మారుతి డెవలప్ చేసినట్టు తెలుస్తోంది. మారుతీ లాంటి కామెడీ డైరెక్టర్ ప్రభాస్ తో హిస్టారికల్ సబ్జెక్టు ని ఎలా డీల్ చేస్తాడు అనే భయం అభిమానుల్లో కూడా ఉంది. కానీ ఏ డైరెక్టర్ ని కూడా తక్కువ అంచనా వేయలేము, వాళ్ళు నేడు ఈ స్థాయిలో ఉన్నారంటే ఎదో టాలెంట్ ఉండబట్టే కదా?, కేవలం ఒక జానర్ సినిమాలు మాత్రమే కాదు, అన్ని రకాల జానర్ సినిమాలు తీసే డైరెక్టర్స్ మన ఇండస్ట్రీ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ అంటున్నారు.