Sandeep Vanga vs Allu Arjun News: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆయన పలు రకాలు వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరోయిన్ విషయంలో దీపిక పదుకొనే (Deepika Padukone) తో మొన్నటిదాకా కొన్ని విభేదాలను పెట్టుకున్న ఆయన మొత్తానికైతే త్రిప్తి డిమ్రి ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకొని అందరి నోళ్ళు మూయించాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ (Allu Arjun) సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) తో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి ప్రభాస్ తో చేయాల్సిన స్పిరిట్ సినిమాకి ముందే ఈ సినిమా తెరకెక్కుతుందని అందరు అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేటయ్యింది. దాంతో సందీప్ వంగ స్పిరిట్ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టాడు. కాబట్టి ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. కానీ అనుకోకుండా అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టు మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదట…
Also read: Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ సినిమాలు బోల్డ్ సీన్స్ వల్లే సక్సెస్ అవుతున్నాయా..?
దాంతో ఈ ప్రాజెక్టుని రామ్ చరణ్ తో చేయాలనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ కి చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక పిఆర్ఓ టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే సందీప్ రెడ్డివంగా – రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా అయితే ఫిక్స్ అయిందని అది తొందరలోనే అనౌన్స్ కూడా చేయబోతున్నారు అంటూ మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Allu Arjun: శక్తి మాన్ గా అల్లు అర్జున్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ మీద కోపంతోనే సందీప్ రెడ్డివంగా రామ్ చరణ్ ని హీరోగా పెట్టి ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నారా అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగ మాత్రం తన వైఖరి మార్చుకోకుండా తనని విమర్శించే ప్రతి ఒక్కరికి గట్టి కౌంటర్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు…