Sandeep Reddy Vanga vs Deepika Padukone : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)…ఆయన చేసిన అనిమల్ (Animal) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. రన్బీర్ కపూర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా ఒక అనిమల్ (Animal) ఎలా బిహేవ్ చేస్తుందో అలాంటి ఒక క్యారెక్టర్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా రన్బీర్ కపూర్ అనిమల్ ల మారే విధానాన్ని అలాగే ఆయనకు ఉండే ఎమోషన్స్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ప్రభాస్(Prabhas)తో చేస్తున్న సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా దీపికా పదుకొనే (Deepika Padukone) ను తీసుకోవాలని అనుకున్న సందీప్ ఆమెకి కథ మొత్తాన్ని నరేట్ చేశాడు.
ఇక ఆమె కథవిని కొన్ని కండిషన్స్ పెట్టడం తో ఆమె సందీప్ అలాంటి కండిషన్స్ తనకు వర్కౌట్ కావని చెప్పి ఆమెను పక్కన పెట్టేసి త్రిప్తి డిమ్రీ (Thripthi Dimri) ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశాడు. ఇక దాంతో కోపానికి వచ్చిన దీపికా పదుకొనే స్పిరిట్ సినిమా కథను బయటపెట్టింది.
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కాంబో లో రావాల్సిన సినిమా ఉంటుందా..?
సోషల్ మీడియాలో స్పిరిట్ మూవీ కథ ఇదే అంటూ కొన్ని వార్తలు రావడంతో సందీప్ రెడ్డివంగా దీపిక మీద చాలా ఫైర్ అవుతూ ఒక ట్వీట్ అయితే చేశాడు. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు కొంతమంది హీరో హీరోయిన్లను తమ సినిమాలో పెట్టుకోవాలని అనుకుంటారు.
వాళ్లకు కథను నరేట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ కథ నచ్చితే సినిమాని చేస్తారు, లేకపోతే చేయడం మానేస్తారు. అంతేకానీ కథను విన్న తర్వాత ఆ స్క్రిప్టు ను రిజెక్ట్ చేసి ఆ కథను బయట పెట్టడం అనేది సరైన విషయం కాదు. ఇప్పుడు దీపిక పదుకొనే చేసిన పనికి ఆమె మీద ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు. ఈ టోటల్ వ్యవహారంలో దీపిక పదుకొనే చేసిందే తప్పు అంటూ చాలామంది సందీప్ రెడ్డి వంగ కు సపోర్టుగా మాట్లాడుతుండడం విశేషం…