Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సందె రెడ్డి వంగ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలలో తనను తాను టాప్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించలేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఒక డీసెంట్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరగడం లేదు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ 2500 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతోంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
దాంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండడం లేదు. సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చే సినిమాలు విజువల్ గా చాలా బాగుంటాయి. అలాగే ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక దానికి తోడుగా ఆయన మార్క్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా మొత్తానికైతే పలు రికార్డులను క్రియేట్ చేస్తుందనేది వాస్తవం. ఇండియన్ ఇండస్ట్రీ లోనే సందీప్ రెడ్డి వంగ కి ఒక బ్రాండ్ ఉంది.
ప్రతి ఒక్కరికి ఆయన చేసే బోల్డ్ సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఆయన సినిమాల్లో ఒక ప్రాపర్ మీనింగ్ ఐతే ఉంటుంది. అది తెలుసుకున్న వారు ఎవరు అతన్ని విమర్శించారు… స్పిరిట్ సినిమాని సైతం 2026 ఎండింగ్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే 2026 సంవత్సరంలో సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…