Sandeep Reddy Vanga Remuneration: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఈ మూవీ తర్వాత ఆయన చేసిన అనిమల్ సినిమా అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టింది. రన్బీర్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనువైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను డైరెక్టర్ గా మరోసారి ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా స్పిరిట్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట…ప్రభాస్ లాంటి నటుడితో సందీప్ రెడ్డి వంగ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటుంది. తద్వారా సందీప్ రెడ్డివంగ కి ఎలా యూజ్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. దాదాపు ఈ సినిమా కోసం 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మొత్తానికైతే సందీప్ రెడ్డివంగ చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి.
Also Read: శ్రీకాంత్ ఓదెల ను లైట్ తీసుకున్న చిరంజీవి..?
కాబట్టి ఇక మీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది. మరి రాబోతున్న రోజుల్లో కూడా సందీప్ రెడ్డివంగ ఎలాంటి సినిమాలు చేస్తాడు తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
మరి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాతో ప్రభాస్ కి ఏ రేంజ్ సక్సెస్ ని సాధించి పెడతాడు అనేది చర్చనీయాంశంగా మారింది… 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడతాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథతోనే.. సేతుపతితో పూరి సినిమా..?
మొత్తానికైతే ప్రభాస్ తో ఆయన చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…ఇకమీదట నుంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నే ఉదాహరణగా చెప్పుకుంటారు అని సందీప్ రెడ్డివంగా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…