Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక హీరోను స్టార్ హీరోగా మార్చడంలో దర్శకులు కీలకపాత్ర వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. భారీ సక్సెస్ అందుకున్న ప్రతి హీరో స్టార్ హీరోగా మారతాడు. మరి ఆ సూపర్ సక్సెస్ రావాలి అంటే మంచి కథను రాసుకొని హీరోని భారీ రేంజ్ లో ఎలివేట్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది…
సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు గా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ వాళ్ళు వాళ్ళ పూర్తి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ సాధిస్తుంది. లేకపోతే మాత్రం భారీ డిజాస్టర్ ని మూట గట్టుకునే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy)సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోతే సందీప్ రెడ్డివంగ ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అందుకే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి కోసం అర్జున్ రెడ్డి విపరీతంగా పరితపిస్తూ ఉంటాడు.
అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషన్ గా మారిపోయింది. కారణం ఏంటి అంటే ఒక అమ్మాయికి స్టిక్ అయిపోయిన అబ్బాయి అమ్మాయికి పెళ్లి అయిన సరే పిల్లలు ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా సరే వారిని ప్రేమిస్తూనే ఉంటాడు తప్పు మర్చిపోడు అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు.
నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పెళ్లి అయినప్పటికి ఆమె మాత్రం అర్జున్ రెడ్డి కోసమే వెయిట్ చేస్తుంది. ఇలా అమ్మాయి అబ్బాయి ప్రేమని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్నట్టుగానే సందీప్ రెడ్డి వంగ నిజ జీవితంలో కూడా ఆయనకు ప్రీతి అనే అమ్మాయి ఉందా దానివల్లే సందీప్ అంత గొప్ప లవ్ స్టోరీ రాశాడా అంటూ కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.
ఆయన పర్సనల్ విషయాలు పెద్దగా జనాలతో పంచుకోడానికి ఇష్టపడడు కాబట్టి సందీప్ రెడ్డి వంగా నిజ జీవితంలో లవర్ ఉందా లేదా అనే విషయాలు కూడా ఎవరికీ తెలియవు. మరి ఫ్యూచర్ లో ఆయన తెలియజేసే ప్రయత్నం ఏమైనా చేస్తాడేమో చూడాలి…