Animal: రన్బీర్ కి రష్మిక ఘాటైన లిప్ కిస్… సంచలనం రేపుతున్న పోస్టర్!

అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. జనాలు మాత్రం సినిమాను ఎగబడి చూశారు.

Written By: Shiva, Updated On : October 10, 2023 2:25 pm

Animal

Follow us on

Animal: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లిప్ లాక్ సన్నివేశాలకు ఫేమస్. అర్జున్ రెడ్డి మూవీతో ఆయన టాలీవుడ్ ని షేక్ చేశాడు. ఈ చిత్రంలో ముద్దు సీన్లు చర్చకు దారి తీశాయి. అప్పట్లో పెద్ద ఎత్తున టీవీ డిబేట్లు పెట్టారు. అర్జున్ రెడ్డి మూవీ నుండి లిప్ లాక్ సన్నివేశాలు తొలగించాలని కొందరు డిమాండ్ చేశారు. పోస్టర్స్ పై అభ్యంతరం చెప్పారు. ప్రేమలోని ఘాడత చెప్పాలంటే ముద్దు సీన్స్ తప్పనిసరి అని సందీప్ రెడ్డి బలంగా నమ్ముతారు.

అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. జనాలు మాత్రం సినిమాను ఎగబడి చూశారు. ఇక సందీప్ రెడ్డి లేటెస్ట్ మూవీలో కూడా ఈ లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని హింట్ ఇచ్చేశాడు. రన్బీర్-రష్మిక ఘాటుగా పెదాలు జుర్రుకుంటున్న పోస్టర్ విడుదల చేశారు.

యానిమల్ మూవీ నుండి అమ్మాయి అనే ఫస్ట్ సింగిల్ విడుదల కాగా రొమాంటిక్ పోస్టర్ వదిలారు. సదరు పోస్టర్ లో హీరో హీరోయిన్ లిప్ కిస్ చేసుకుంటున్నారు. ఈ పోస్టర్ నెటిజన్స్ ని ఆకర్షించింది. సోషల్ మీడియాలో చర్చకు తెరలేపింది. యానిమల్ మూవీలో రష్మిక రన్బీర్ కపూర్ భార్య రోల్ చేస్తుంది. సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేస్తున్నారు.

యానిమల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కింది. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. యానిమల్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ చాలా వైలెంట్ గా ఉంది. అసలు వైలెన్స్ అంటే ఏమిటో యానిమల్ మూవీలో చూపిస్తానని సందీప్ రెడ్డి వంగా తెలియజేశారు. యానిమల్ మూవీ ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.