Sandeep Reddy Vanga: తను అనుకున్న కాన్సెప్టును యాజ్ టీజ్ గా తెరమీదకి తీసుకురాగలిగే సత్తా ఉన్న దర్శకులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో సందీప్ రెడ్డి వంగ మొదటి స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారట. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండటం వల్ల వాటిని చేయడానికి ప్రభాస్ కొంతవరకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక వాటిని సినిమా నుంచి తీసివేస్తే సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని సందీప్ రెడ్డి వంగ భయపడుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడి నుంచి రాబోతున్న సినిమా మీద ప్రతి ఒక్కరికి మంచి అంచనాలైతే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడం అతనికి ఎంత ప్లస్ అవుతుందో అంతే మైనస్ అవుతుంది అంటూ అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు… నిజానికి అనిమల్ సినిమాలో పెట్టినట్టుగా బోల్డ్ సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టడానికి వీల్లేదు.
ఎందుకంటే ప్రభాస్ స్టార్ హీరో కాబట్టి అతని సినిమాలనున్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారు. ముఖ్యంగా అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. కాబట్టి వాళ్ల దృష్టిలో ప్రభాస్ చాలా టాప్ రేంజ్ లో ఉండాలి తప్ప అలా బోల్డ్ సన్నివేశాల్లో నటించి తనను తాను తగ్గించుకోకూడదు… కాబట్టి ఇవన్నీ కండిషన్స్ మధ్యలో సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాల్సి ఉంది.
కాబట్టి వాటన్నింటిని చూసుకుంటూ సినిమాలో బోల్డ్ సన్నివేశాలను పెడతాడా? లేదంటే తనను తాను నియంత్రించుకొని మరి అవసరం లేని సన్నివేశాలను సినిమా నుంచి తొలగిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది…ఈ విషయంలోనే సందీప్ రెడ్డివంగ కొంతవరకు తడబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి సినిమాను ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…