Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త ఒరవడి తొక్కింది. అందులో ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా అనే డైరెక్టర్ అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి ఒక సాలిడ్ హిట్ అందుకోవడమే కాకుండా సినిమా అనే ఒక మూస ధోరణిని పటా పంచలు చేసి తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఏర్పరచు కోవడమే కాకుండా సినిమా అనేది ఇలా కూడా ఉంటుందా ఇలా కూడా తీయొచ్చా అనే ఒక రేంజ్ లో సినిమాను తీసి సక్సెస్ సాధించి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు రన్బీర్ కపూర్ ని హీరోగా పెట్టి ఆనిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి భారీ ఎత్తున ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది అది ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ మొదట ఈ సినిమా స్టోరీని మహేష్ బాబు కి చెప్పాడని ఆయన ఈ కథని రిజెక్ట్ చేసినట్టుగా చాలా రకాల కథనాలు అయితే వస్తున్నాయి.ఇక వాటికి చెక్ పెట్టడానికి సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ నేను మహేష్ బాబు కి కథ చెప్పిన మాట వాస్తవం కానీ ఆయనకు అనిమల్ కథని నేను చెప్పలేదు. అని ఆయన అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు ఇక దాంతో మహేష్ బాబుకి చెప్పిన కథ ఏంటి అనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే మహేష్ బాబు కి చెప్పిన కథ ఎలాంటిది అనే దాని విషయం మీద ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు కానీ మహేష్ బాబుకు చెప్పిన కథ మాత్రం అనిమల్ కాదని ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇచ్చాడు…ఇక దాంతో మహేష్ బాబుని ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ చేయకుండా ఆపేస్తున్నారు. ఇక ఇంతకుముందు మహేష్ బాబు అద్భుతమైన సినిమాను మిస్ చేసుకున్నాడు అంటూ విపరీతమైన ట్రోలింగ్స్ అయితే చేశారు. ఇంకా వాటికి చెక్ పెడుతూ సందీప్ రెడ్డి వంగ స్పందించడం కొంతవరకు మహేష్ అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది…
అయితే అనిమల్ సినిమా తర్వాత ఆయన ప్రభాస్ హీరో గా స్పిరిట్ అనే సినిమా చేయనున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో కూడా ఫ్యూచర్ లో ఒక సినిమా చేసే అవకాశం అయితే ఉంది…