‘Kannappa’ Movie First Review : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఈ సినిమా ఈ నెల 27 న విడుదల అయ్యేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నది. అన్ని ప్రాంతాలకు సంబంధించిన బయ్యర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. మొదటి కాపీ కి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్ననే హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారట. సినిమా నిడివి మూడు గంటలకు పైనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మంచు కుటుంబానికి సంబంధించిన సినిమా అంటే సోషల్ మీడియా లో నెగటివిటీ వేరే రేంజ్ లో ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే వీళ్ళ సినిమాలో బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనే అభిప్రాయం జనాల్లో ఉంటుంది. అలా కన్నప్ప చిత్రం పై కూడా బోలెడంత నెగటివిటీ ఉంది. కానీ నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా చాలా బాగా వచ్చిందట. సినిమా నిడివి మూడు గంటలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉండేలా తీర్చి దిద్దారట. అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసిన విషయం ఏమిటంటే ఇందులో మంచు విష్ణు అద్భుతంగా నటించడమే. టీజర్స్ లో విష్ణు నటనని చూసి అనేక మంది ట్రోల్స్ చేశారు. కానీ సినిమా చూసిన తర్వాత అబ్బో ఇతనిలో ఇంత విషయం ఉందా అని ఆశ్చర్యపోయే విధంగా చేసాడట. ముఖ్యంగా క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా ఉంటుందట. అదే విధంగా ఈ చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ నిడివి దాదాపుగా 35 నిమిషాల వరకు ఉంటుందని. ఆయన క్యారక్టర్ కూడా చాలా బాగా వచ్చిందని, ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.
Also Read : బ్రాహ్మణులపై మంచు కుటుంబం పగబట్టేసిందా..? మరో వివాదంలో చిక్కుకున్న ‘కన్నప్ప’!
ఇక మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారు కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యే విధంగా నటించారని, గ్రాఫిక్స్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీసారని, కచ్చితంగా ఈ చిత్రం వర్కౌట్ అవుతుందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన వాళ్లంతా. సినిమా బాగా ఉండడం వల్లే అన్ని ప్రాంతాలకు సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయ్యింది అని, ఇక ప్రభాస్ వల్ల ఈ సినిమాకి మొదటి రోజు యూత్ ఆడియన్స్ కచ్చితంగా కదులుతారని, ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి వాళ్ళ అంచనాలను ఈ చిత్రం ఎంత వరకు నిజం చేస్తుందో చూడాలి. త్వరలోనే ఓవర్సీస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించబోతున్నారట. బుక్ మై షో యాప్ లో ఇప్పటికే ఈ చిత్రానికి లక్షా 43 వేల లైక్స్ కూడా వచ్చాయి.