
ప్రేయసి.. ప్రేమికుడు ప్రేమించుకున్నంత సేపు బాగానే ఉంటారు.. ఎప్పడైతే వారి మధ్య పెళ్లి ప్రస్తావన వస్తుందో అప్పటి నుంచో గొడవలు స్ట్రాట్ అవుతుంటాయి. అయితే అందరూ అలా ఉంటారని కాదనుకోండి.. అయితే ఇటీవల కాలంలో ప్రేయసిని పెళ్లి చేసుకోకుండా మొఖంచాటేసే వాళ్లే ఎక్కువగా కన్పిస్తుండం శోచనీయంగా మారింది.
Also Read: మహేష్ బాబునే ఇంతలా భయపెట్టారంటే?
తాజాగా ఓ కుర్ర హీరోయిన్ ప్రియుడి చేతిలో మోసపోయి లబోదిబోమంటూ పోలీసులు.. కేసుల చుట్టూ తిరుగుతోంది. దీంతో ఎవరా? కుర్రహీరోయిన్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ సనంశెట్టి. ఈ కుర్ర హీరోయిన్ తెలుగు, తమిళంలోని పలు భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
సనంశెట్టి తాజాగా నటుడు దర్శిన్ తో ప్రేమలో పడింది. దర్శిన్ తమిళ బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా పాపులర్ అయ్యాడు. కొంతకాలంగా వీరద్దరి ప్రేమించుకుంటున్నారు. దర్శిన్ తనను పెళ్లి చేసుకుంటాడని సనంశెట్టి నమ్మింది. దీంతో అతడితో ఆమె చెట్టాపట్టాలేసుకొని తీరింది. తీరా సనంశెట్టి పెళ్లి ప్రస్తాసన తీసుకురాగానే దర్శిన్ ముఖంచాటేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు తత్వం బోధపడనట్లయింది.
మనసిచ్చినవాడు మనువు ఆడుతాడు అనుకుంటే మోసం చేయడంతో సనంశెట్టి రగిలిపోయింది. తనకు న్యాయం చేయాలని ఆడియారు మహిళా పోలీస్ స్టేషన్లో సనంశెట్టి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె మొరను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదట. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో పోలీసులకు దర్శిన్ పై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులను దర్శిన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:బిగ్ బాస్ కు నాగార్జున దూరం.. ఏం జరుగనుంది?
ఇదంతా చూస్తుంటే దర్శిన్ సనంశెట్టిని పెళ్లి చేసుకునే అవకాశం లేనట్టేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రియుడి కోసం సనంశెట్టి పోలీస్ స్టేషన్.. కోర్టులంటూ తిరుగుతూ తన ప్రేమను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. చివరికీ ఈ కుర్ర హీరోయిన్ ప్రేమ సుఖంతం అవుతుందా? లేక ట్రాజడీగా మిలుగుతుందో వేచి చూడాల్సిందే..!