https://oktelugu.com/

సేవలో సంపూ.. మరో గొప్ప పని చేశాడు !

వీడు హీరో ఏమిటి అంటూ సంపూర్ణేష్‌ బాబును హేళన చేయడంలో చాలా మంది నెటిజన్లు తమ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నిజమే మనకున్న స్టార్స్ తో పోల్చుకున్నప్పుడు సంపూ కంపు కొట్టొచ్చు. కానీ, గొప్పగా చెప్పుకునే స్టార్స్ కంటే, చులకన అయ్యేందుకు అలవాటు పడిన సంపూ చాల గొప్ప వ్యక్తి అని మరోసారి రుజువు అయింది. ఏ ఆపద వచ్చినా… వచ్చిన ప్రతిసారీ తన గొప్ప మనసు చాటుకుంటూ వస్తున్నాడు సంపూ. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన […]

Written By:
  • admin
  • , Updated On : July 1, 2021 / 06:23 PM IST
    Follow us on

    వీడు హీరో ఏమిటి అంటూ సంపూర్ణేష్‌ బాబును హేళన చేయడంలో చాలా మంది నెటిజన్లు తమ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. నిజమే మనకున్న స్టార్స్ తో పోల్చుకున్నప్పుడు సంపూ కంపు కొట్టొచ్చు. కానీ, గొప్పగా చెప్పుకునే స్టార్స్ కంటే, చులకన అయ్యేందుకు అలవాటు పడిన సంపూ చాల గొప్ప వ్యక్తి అని మరోసారి రుజువు అయింది. ఏ ఆపద వచ్చినా… వచ్చిన ప్రతిసారీ తన గొప్ప మనసు చాటుకుంటూ వస్తున్నాడు సంపూ.

    తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించి మళ్ళీ సంపూ తన సేవను కొనసాగించాడు. అలాగే ఆ పిల్లలను చదివించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాకకు చెందిన నరసింహచారి దంపతులు అప్పు బాధలను భరించలేక బతుకు పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో వారి ఇద్దరూ కూమార్తెలు దిక్కులేని వారయ్యారు.

    వీరి పరిస్థితి వార్తల్లో చూసిన సంపూర్ణేష్‌ చలించిపోయారు. తక్షణమే వారి వివరాలు తెలుసుకొని వారికి అత్యవసర సాయం కింద రూ. 25 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా చెబుతూ.. ‘దుబ్బాకకు చెందిన నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నేను ఎంతగానో బాధ పడ్డాను. నా హృదయం ఇప్పటికీ బాధ పడుతూనే ఉంది.

    తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డలకు నేను, సాయి రాజేశ్‌ గారు కలిసి రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించగలిగాం. అలాగే ఆ పిల్లల చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని ఆ చిన్నారులకు మాట ఇచ్చాము. కచ్చితంగా వారికీ అన్ని విధాలుగా అండగా నిలబడతాం’ అంటూ సంపూ రాసుకొచ్చాడు. విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారి తనకు తోచిన సాయం చేస్తున్న సంపూ సేవను మెచ్చుకుందాం. ప్రస్తుతం సంపూ ‘బజారు రౌడీ, ‘క్యాలీఫ్లవర్‌’, ‘పుడింగి నంబర్‌ వన్‌’ సినిమాల్లో నటిస్తున్నాడు.