Homeఎంటర్టైన్మెంట్Extra Jabardasth Promo: సామి సామి అంటూ ఎక్సట్రా జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన సింగర్

Extra Jabardasth Promo: సామి సామి అంటూ ఎక్సట్రా జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన సింగర్

Extra Jabardasth Promo: ప్రతి శుక్రవారం వెరైటీ స్కిట్లతో వచ్చి కడుపుబ్బా నవ్విస్తూ ఉండే ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమం తాజాగా ఒక ప్రోమోని విడుదల చేసింది. ఈ టీవీ లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మనో, రోజా సెల్వమణి న్యాయ నిర్ణేతలుగా… వ్యాఖ్యాతగా రష్మీ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.

Also Read: కూతురే అమ్మగా… సంతోషంలో నటరాజ్ మాస్టర్ !

Extra Jabardasth Promo
Saami Saami Singer Mounika Yadav

ఎప్పుడూ కొత్తరకమైన కాన్సెప్ట్స్ తో,వైవిధ్యమైన పంచులతో కామెడీ ని పండిస్తూ… స్కిట్స్ ని అదరగొడ్తున్నారు ఎక్సట్రా జబర్దస్త్ కంటెస్టెంట్స్. అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా వెండితెర కి సంబంధించిన సెలబ్రిటీస్ కూడా ఎక్సట్రా జబర్దస్త్ స్టేజ్ కి వస్తుంటారు.
ఈ నేపథ్యం లో నవంబర్ 26 న విడుదల కాబోతున్న అనుభవించు రాజా మూవీ కి సంబంధించిన చిత్ర యూనిట్ ఎక్సట్రా జబర్దస్త్ కార్యక్రమానికి ప్రమోషన్స్ లో భాగంగా వచ్చారు.

బుల్లి తెర పైన ఈటీవీ లో ప్రసారం అవుతున్న శతమానం భవతి సీరియల్ విలన్ గా విలక్షణంగా నటిస్తున్న శ్రీవాణి… ఇమ్మానుయేల్ స్కిట్ కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమం లో తాజా గా పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో సామీ సామీ అంటూ పాట పాడిన మౌనిక యాదవ్ కెవ్వు కార్తిక్ స్కిట్ లో మెరిసింది. యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది మౌనిక యాదవ్. ఇప్పుడు బుల్లి తెరపైన సందడి చెయ్యడానికి, ప్రేక్షకులని అలరించడిని ఎక్సట్రా జబర్దస్త్ స్టేజి ఎక్కింది మౌనికా యాదవ్.

Also Read: అర్హ పుట్టిన రోజుకు అల్లు ఫ్యామిలీ స్పెషల్ గిఫ్ట్​.. నెట్టింట్లో వీడియో వైరల్​

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.
Exit mobile version