Nayanthara: నయనతార.. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించి తన రేంజ్ ను అంతకంతకు పెంచుకుంది ఈ భామ. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ.. తన సత్తా చాటుతుంది నయన. ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈమె చేతిలో మంచి సినిమాలు ఉన్నాయని టాక్. ఇక హీరోయిన్ గా సూపర్ సక్సెస్ ను అందుకున్న నయనతార సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించి హీరోయిన్ లలోనే టాప్ లో ఉంది.
ఈమె విగ్నేష్ ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఈ దంపతులు కవలలతో కలిసి ఉన్న సరదా క్షణాలను సోషల్ మీడియాలో ఎన్నో సార్లు పంచుకున్నారు. ఇటు వృత్తి పరంగా, అటు కెరీర్ పరంగా మంచి సక్సెస్ తో దూసుకొని వెళ్తూ అందరి దృష్టితనపై ఉండేలా చేసుకుంది నయనతార. అయితే ప్రస్తుతం నయనతారకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?
నయనతార ఎడమ చేతికి 6 వేళ్లు ఉన్నాయంటూ ఓ ఫోటో వైరల్ గా మారింది.ఈమె ఎడమ చేతి చిటికెన వేలు పక్కన మరొక చిన్న వేలు ఉన్నట్టుగా అర్థం అవుతుంది. కానీ ఈ వేలును ఇంత వరకు ఎవరు గుర్తించలేదట. ప్రస్తుతం ఆమె చేతికి ఆరు వేళ్లు ఉండడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. నిజమే నయనతారకు ఆరు వేళ్లు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇవే వేళ్లు ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి అని కూడా టాక్.
ఇదిలా ఉంటే రీసెంట్ గా జవాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంది నయనతార. అందులో నటించి పాన్ ఇండియా రేంజ్ లో తనేంటో ప్రూఫ్ చేసుకుంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నటిస్తూ తనకంటూ స్సెషల్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈ భామ.. ఆరు వేళ్లతో లక్ ను సంపాదించింది అంటూ టాక్.