Samantha: సమంత హాట్ వర్క్ అవుట్ వీడియో వైరల్… ఆ షేప్స్ కోసం చెమటలు చిందుస్తున్న భామ

దాదాపు ఆరు నెలలు ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి షూటింగ్స్ లో పాల్గొన్నారు. పెండింగ్ లో ఖుషి మూవీ షూటింగ్ పూర్తి చేసింది.

Written By: NARESH, Updated On : November 26, 2023 11:21 am

Samantha

Follow us on

Samantha: సమంత ఫిట్నెస్ ఫ్రీక్. ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందే. ఏ జీరో సైజ్ భామ యాబ్స్ కోసం స్పెషల్ వర్క్ అవుట్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. సమంత ప్రస్తుతం విరామంలో ఉన్నారు. ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు. సమంతకు మయోసైటిస్ సోకిన నేపథ్యంలో చికిత్స కోసం బ్రేక్ తీసుకున్నారని సమాచారం. పలు రకాల చికిత్సలను ఆమె ట్రై చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత తనకు మయోసైటిస్ సోకిన విషయం బయటపెట్టింది.

దాదాపు ఆరు నెలలు ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో తిరిగి షూటింగ్స్ లో పాల్గొన్నారు. పెండింగ్ లో ఖుషి మూవీ షూటింగ్ పూర్తి చేసింది. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంది. సిటాడెల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ కానుంది.

ఒక పక్క చికిత్స తీసుకుంటూనే సమంత వ్యాయామం ఆపడం లేదు. అది కూడా కఠిన కసరత్తులు చేస్తుంది. చాలా కాలంగా సమంత జీరో సైజ్ ప్యాక్ మైంటైన్ చేస్తుంది. దీని కోసం ఆమె జిమ్ లో గంటల తరబడి వర్క్ అవుట్ చేస్తుంది. డైట్ ఫాలో అవుతుంది. ఇంటి దగ్గరే కొన్ని కూరగాలు, పండ్లు పండించి వాటిని వాడుతుంది సమంత. హెల్త్ ఫిట్నెస్ విషయంలో అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది.

తాజాగా ఆమె యాబ్స్ కోసం స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. సమంత కమిట్మెంట్ చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. సమంత కెరీర్లో సక్సెస్ కావడానికి కూడా కారణం ఇదే. ఆమె హార్డ్ వర్కర్. సమంత ఏమాయ చేసావే మూవీతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. 2010లో ఆ మూవీ విడుదల కాగా 14 ఏళ్ల కెరీర్లో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. స్టార్ హీరోయిన్ గా అనేక విజయాలు, మైలు రాళ్లు చేరుకుంది. హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే…