Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైం లో ఒక్కో ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఫాదర్ సెంటిమెంట్ సినిమాలకి డిమాండ్ పెరుగుతుంది. అయితే ఒకప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్టీయార్ హీరో గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నాన్న కు ప్రేమతో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఆ తర్వాత పెద్దగా ఫాదర్ సెంటిమెంట్ తో సినిమాలు రానప్పటికీ ఇప్పుడు మాత్రం ఫాదర్ సెంటిమెంట్ తో రెండు సినిమాలు వస్తున్నాయి ఒక వారం గ్యాప్ లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇందులో అనిమల్ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణ్బీర్ కపూర్ హీరోగా అనిమల్ అనే సినిమా వస్తుంది. ఇక ఇది ఇక ఉంటే నాని హీరో గా శౌర్యువ్ అనే యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో హాయ్ నాన్న అనే సినిమా వస్తుంది…
ఇక అనిమల్ సినిమా స్టోరీ విషయానికి వస్తే వాళ్ళ నాన్న అంటే తనకి బాగా ఇష్టం ఉన్న ఒక కొడుకు నాన్న కోసం ఏదైనా చేయగలిగే అంత ప్రేమ ఉండి వాళ్ళ నాన్నకి ఇబ్బంది కలిగినప్పుడు తను ఒక అనిమల్ లా మారి అందరి మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు ఇదే సినిమా ప్లాట్…
ఇక హాయ్ నాన్న విషయానికి వస్తే పెళ్లి చేసుకొని ఒక పాప పుట్టిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కూతురిని వదిలేసి వెళ్లిపోయిన తల్లి జ్ఞాపకాలను గుర్తు లేకుండా నాన్న ఆ అమ్మాయిని పెంచుతూ ఉంటాడు ఆ అమ్మాయికి ప్రపంచం మొత్తం వాళ్ళ నాన్న నే అనే కాన్సెప్ట్ తెరకెక్కిందే ఈ సినిమా…ఈ సినిమాలు కనక సక్సెస్ సాధిస్తే ఇలాంటి తరహా సినిమాలు ఇండస్ట్రీలో చాలా వరకు వస్తాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
నిజానికి అమ్మా నాన్న ఎమోషన్ మీద వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తాయి. ఆ పాయింట్ ను ఎంచుకోవడం లోనే సినిమా అనేది సగం సక్సెస్ అవుతుంది. అందుకే చాలా మంది ఇప్పుడు అలాంటి ఎమోషన్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఇక నాని ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఇది వరుసగా రెండోవ సక్సెస్ అవుతుంది.ఇంతకు ముందు దసర సినిమా తో సక్సెస్ సాధించిన నాని ఇప్పుడు ఈ సినిమా తో మరో సక్సెస్ ని తన కథలో వేసుకుంటాడు…