https://oktelugu.com/

‘సమంత’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

వరుస హిట్లతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌ గా ఫుల్ బిజీగా ఉన్న ‘సమంత’ త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ మనముందుకు రాబోతోంది. ఆమె నటించిన ఈ వెబ్ ‌సిరీస్‌ ఫిబ్రవరి 12నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అలరించనుంది. కాగా ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ విడుదల తేదీని తాజాగా దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్ లో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధానపాత్రలో కనిపించబోతుండగా.. సమంత మరో కీలక పాత్రలో నటించింది. […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 07:16 PM IST
    Follow us on


    వరుస హిట్లతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌ గా ఫుల్ బిజీగా ఉన్న ‘సమంత’ త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ మనముందుకు రాబోతోంది. ఆమె నటించిన ఈ వెబ్ ‌సిరీస్‌ ఫిబ్రవరి 12నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అలరించనుంది. కాగా ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ విడుదల తేదీని తాజాగా దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సిరీస్ లో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధానపాత్రలో కనిపించబోతుండగా.. సమంత మరో కీలక పాత్రలో నటించింది.

    Also Read: కరోనాని జయించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

    సమంత ఈ వెబ్ సిరీస్ చేస్తోంది అనే వార్త వచ్చినప్పటి నుండి ఈ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక థ్రిల్లర్‌ కాన్సెప్టుతో వస్తున్న ఈ సిరీస్‌లో మొదటి పార్ట్ సెప్టెంబర్ 2019‌లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సూపర్ హిట్ అయింది. అందుకే మొదటి పార్ట్ కి కొనసాగింపుగా ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ను తీసుకువస్తున్నారు. ఇక ఈ సిరీస్‌ రాజ్‌, డీకే దర్శకత్వంలో తెరకెక్కింది.

    Also Read: సోనూ సూద్ తప్పు చేసాడంటూ పోలీస్ కేసు !

    తనకు మొదటి వెబ్‌సిరీస్‌ కావడంతో సమంత చాలా కష్టపడి పనిచేసిందట. ఇందులో ప్రియమణి, షరీబ్ హష్మి, సీమా బిస్వాస్, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అలరించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్