https://oktelugu.com/

ఉత్కంఠ: కేసీఆర్ ఆరోగ్యానికి అసలేమైంది?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎప్పుడూ మిస్టరీనే.. అప్పట్లో కరోనా సోకిందని.. ఆయన ఫాంహౌస్ లో సీరియస్ గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. 15 రోజులు కేసీఆర్ కనిపించలేదు. అయితే సడెన్ గా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. తాను సుబ్బరంగా ఉన్నట్టు మీడియా ముందు చెప్పాడు. Also Read: జగన్ ను లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఇక అప్పట్లో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని.. అందుకే కేటీఆర్ ను సీఎం చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2021 7:50 pm
    Follow us on

    CM KCR

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎప్పుడూ మిస్టరీనే.. అప్పట్లో కరోనా సోకిందని.. ఆయన ఫాంహౌస్ లో సీరియస్ గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. 15 రోజులు కేసీఆర్ కనిపించలేదు. అయితే సడెన్ గా మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. తాను సుబ్బరంగా ఉన్నట్టు మీడియా ముందు చెప్పాడు.

    Also Read: జగన్ ను లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్

    ఇక అప్పట్లో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని.. అందుకే కేటీఆర్ ను సీఎం చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని కేసీఆర్ కొట్టిపారేస్తుంటారు. కానీ ఇప్పటికీ కేసీఆర్ ఆరోగ్యం అనేది మిస్టరీనే. దాన్ని ఎవరూ శోధించలేరు.. సాధించలేరు. అది ఎప్పటికీ బయటపడదు.

    అయితే తాజాగా కేసీఆర్ కు మళ్లీ అనారోగ్యం వెంటాడింది. తాజాగా ఆయనను సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలను వైద్యులు చేశారు. అనంతరం సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆరోగ్యం చాలా బాగుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది చేసే వైద్య పరీక్షలే ఆయన చేయించుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో సిటీ స్కాన్ చేశామని.. రిపోర్ట్ శుక్రవారం వస్తుందని ప్రకటించారు. ఎంఐఆర్ స్కానింగ్ అవసరం లేదని, కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఎంవీ.రావు పేర్కొన్నారు.

    Also Read: కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. అఖిలప్రియనే సూత్రధారి?

    అయితే కరోనా కల్లోలం వేళ సీఎం కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంట అనగానే టీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ దగ్గరుండి చికిత్సనందించడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. వ్యాధి నిర్ధారణ కోసం అక్కడ పలు పరీక్షలు చేశారని అంటున్నారు.

    ఇక కేసీఆర్ కు ఏం కాలేదని.. స్వల్ప అనారోగ్యం అని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే అంత స్వల్ప అనారోగ్యం అయితే కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌ సహా ఇంత కీలక ప్రముఖులు ఎందుకు ఆస్పత్రికి వచ్చారన్నది ఇప్పుడు అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. మరి నిజంగానే కేసీఆర్ ఏదైనా సీరియస్ నా? లేక సాధారణ పరీక్షలా? అన్నది తెలియాల్సి ఉంది. అప్పటిదాకా ఇదంతా వట్టి గాసిప్ గానే భావించాల్సి ఉంటుంది?

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్