Samantha: రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ కి సమంత గిఫ్ట్…!

ప్రీతమ్ తో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చినా సమంత లెక్క చేయలేదు. అతనితో స్నేహం వదులుకోలేదు. మాయోసైటిస్ వచ్చాక తన గ్యాంగ్ కి కొంచెం దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత సమంత-ప్రీతమ్ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది.

Written By: Shiva, Updated On : October 12, 2023 10:56 am

Samantha

Follow us on

Samantha: సమంత విడాకుల సమయంలో ఒక పేరు గట్టిగా వినిపించింది. అదే ప్రీతమ్ జుకల్కర్. సమంతకు ప్రీతమ్ పర్సనల్ స్టైలిస్ట్. అయితే అంతకు మించిన అనుబంధం వాళ్ళ మధ్య ఉంది. చాలా సన్నిహితంగా ఉంటారు. విదేశాలకు టూర్స్ కి వెళుతుంటారు. వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో పుకార్లు లేచాయి. నాగ చైతన్య-సమంత మధ్య గొడవలకు ప్రీతమ్ కారణం. అతనితో సమంత సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో విడిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి.

దీంతో ప్రీతమ్ ని అక్కినేని ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడ్డారు. అతన్ని బెదిరించడం జరిగింది. అక్కినేని ఫ్యాన్స్ దెబ్బకు ప్రీతమ్ వివరణ ఇచ్చాడు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సమంతతో నాకున్న అనుబంధం ఏమిటో నాగ చైతన్యకు తెలుసు. నేను ఆమెను అక్కా అని పిలుస్తాను. ఇకనైనా నాపై వేధింపులు ఆపేయాలంటూ కామెంట్ చేశాడు.

ప్రీతమ్ తో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చినా సమంత లెక్క చేయలేదు. అతనితో స్నేహం వదులుకోలేదు. మాయోసైటిస్ వచ్చాక తన గ్యాంగ్ కి కొంచెం దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత సమంత-ప్రీతమ్ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది. సమంత అతడికి గిఫ్ట్ ఇచ్చింది. సందర్భం ఏమిటో తెలియదు కానీ ఇయర్ రింగ్స్ కానుకగా పంపింది. ఈ విషయాన్ని ప్రీతమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఇక్కడ సమంతను అతడు దీదీ అని సంబోధించాడు. దీదీ అంటే హిందీలో అక్క అని అర్థం. కాబట్టి సమంతను అతడు సిస్టర్ లా చూసుకుంటున్నాడు. లేనిపోని పుకార్లు కొందరు పుట్టించారు. నాగ చైతన్యతో విడిపోయిన సమంతను ఓ వర్గం టార్గెట్ చేశారనే వాదన ఉంది. వాళ్లే కావాలని మీడియాలో తప్పుడు వార్తలు రాయించారట. ఈ విషయాన్ని సమంత కూడా గట్టిగా నమ్ముతుంది. ఇదిలా ఉంటే సమంత కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.