Samantha: బికినీ వేసిన సమంత, ఇంత బోల్డ్ గా ఎప్పుడూ చూసి ఉండరు… సూపర్ హాట్ ఫోటో వైరల్!

జీవితం అంటే హిట్స్, బ్లాక్ బస్టర్స్ కాదు. కష్టనష్టాలు, హార్డ్ వర్క్ అని నేను భావిస్తున్నాను. నాకున్న ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తాను. నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తాను, అని సమంత సమాధానం చెప్పింది.

Written By: NARESH, Updated On : November 9, 2023 7:23 pm

Samantha

Follow us on

Samantha: సమంత ప్రముఖ మ్యాగజైన్ షూట్ కోసం సూపర్ సెక్సీగా తయారైంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ మధ్యకాలంలో సమంత ఇంత హాట్ గా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. బజార్ అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్ ధరించింది. బికినీని పోలిన సదరు డ్రెస్ లో సమంత చాలా బోల్డ్ గా ఉంది. ఈ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

సమంతను యాంకర్ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు గురించి అడిగారు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారని యాంకర్ వివరణ కోరారు. సమంత మాట్లాడుతూ… గత రెండేళ్లలో నా జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. వివాహం, ఆరోగ్యం విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవి మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఈ సమయంలో నేను నాలాగే సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తుల జీవితాల గురించి చదివాను. వారు ఎలా ఫైట్ చేసి విజయం సాధించారో తెలుసుకున్నాను.

జీవితం అంటే హిట్స్, బ్లాక్ బస్టర్స్ కాదు. కష్టనష్టాలు, హార్డ్ వర్క్ అని నేను భావిస్తున్నాను. నాకున్న ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తాను. నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తాను, అని సమంత సమాధానం చెప్పింది. సమంత 2021లో నాగ చైతన్యతో విడిపోయింది. అధికారికంగా విడాకుల ప్రకటన చేసింది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆమెపై కొందరు ఆరోపణలు గుప్పించారు.

ఈ వేదన నుండి బయటపడే లోపు.. ఆమెను మరో సమస్య చుట్టుముట్టింది. సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురైంది. సుదీర్ఘ కాలంగా సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి దూరంగా ఉన్నారు. ఆమె ఎలాంటి కొత్త మూవీ ప్రకటన చేయలేదు. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాలతో పలకరించారు. సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.