Samantha- Akkineni Akhil: సమంత మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అక్కినేని అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది. ఇంతకీ సామ్ ఏమి పోస్ట్ పెట్టింది అంటే.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ కాస్త ఎమోషనల్ టోన్ లో సమంత పెట్టింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక తన మాజీ వదిన పెట్టిన పోస్ట్ పై అఖిల్ బాబు ఇంకా స్పందించలేదు. నెటిజన్లు మాత్రం మరిదికి వదిన విషెస్ అంటూ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. ఇక సమంత చైతన్యతో తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుస సినిమాలను అంగీకరిస్తూ అవసరం అయితే బోల్డ్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.
Also Read: Liger Movie: లైగర్ మూవీలో అసలు సీక్రెట్ లీక్.. అందుకే ఆ ట్యాగ్‌లైన్ పెట్టారన్నమాట..!
ఇక నాగచైతన్యతో విడాకుల వ్యవహారం, అలాగే సామ్ ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి సమంత ఇప్పుడిప్పుడే బయట పడుతుంది. ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్టే. ఏది ఏమైనా తన జీవితంలో వచ్చిన అనేక ఇబ్బందులకు సంబంధించి ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది.

‘మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి’ అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసిందా అని ఆరా తీస్తే చైతుని ఉద్దేశించే పోస్ట్ చేసిందని తెలిసింది. మరి చైతు గురించి నెగిటివ్ గా మెసేజ్ లు పెట్టి.. మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ పర్సన్స్ కి మాత్రం పాజిటివ్ గా మెసేజ్ లు పెడుతుంది.
ఇక ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా.. సామ్ కి ఇంకా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మరెన్నో వైవిధ్యమైన పాత్రలు వస్తాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యూనరేషన్ పెంచేసింది. అలాగే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ రేట్లు కూడా రెట్టింపు చేసేసింది. మొత్తమ్మీద సామ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది.
Also Read:Died in 2022: 2022లో చిత్రసీమను ‘వదిలివెళ్లిన’ సినీ ప్రముఖులు..!
[…] Taapsee Pannu: తెలుగు తెర పై పూసిన సొట్టబుగ్గల మందారం ‘తాప్సీ’, హిందీ వెండితెరపై మెరిసిన తెల్లని జాబిల్లి ‘తాప్సీ’, స్క్రీన్ పై ఆమె కనిపిస్తే రంగుల తెర కూడా చిన్నబోతుంది, ‘ఝుమ్మంది నాదం’ అంటూ పరిచయమైనా, సౌందర్యపు జలపాతంలా తెలుగు నుండి తమిళంకి అటు నుండి హిందీకి పరవళ్లు తొక్కిన సొగసుల ప్రవాహం ఆమెది. అందుకే, ‘తాప్సీ పన్ను’ ప్రత్యేకం అయ్యింది. […]