Samantha Second Marriage: సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మొత్తానికి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఐతే, తాజాగా సామ్ పెళ్లి గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సమంత త్వరలోనే మళ్లీ పెళ్లి చేసుకోబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

తనకు కాబోయే కొత్త భర్త కోసమే సామ్ జూబ్లిహిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకుందని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చూస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ జయభేరీ సంస్థ అధినేత మురళీమోహన్ ఇంటి పక్కనే ఉంటుంది. చైతుతో కలిసి సామ్ ఇక్కడే కాపురం పెట్టింది. ఐతే, తన కొత్త భర్తతో ఇక్కడే ఉండటం సామ్ కి ఇష్టం లేదట.
అందుకే..జూబ్లిహిల్స్ లో ఓ కొత్త ఇంటిని సిద్ధం చేసుకుంటుంది. ఇక సామ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, ఆ వ్యక్తి బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖుడు అట. ఆ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ వస్తే.. సామ్ ప్లాట్ లోనే ఆమెతోనే కలిసి ఉంటాడట.
పైగా అతగాడు గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయ్యాడు. పైగా సమంత ప్లాట్ లోనే ఉంటున్నాడు. అతగాడిని అక్కడ చూసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ వార్తను ఇండస్ట్రీ మొత్తానికి ఊదాడు. సమంత ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అతనితో సమంత చాలా సన్నిహితం అయ్యింది.

నిజానికి ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ లోనే అతనితో సామ్ కి చనువు ఏర్పడిందట. అసలు చైతుతో సమంత విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని టాక్ ఉంది. వీరి విషయం చైతుకు తెలిసినప్పటి నుంచే.. చైతు – సామ్ మధ్య విబేధాలు వచ్చాయి. నిజానికి చైతు – సామ్ ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో ఇద్దరికీ మంచి గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్దరి కెరీర్లూ వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి. అంతలో ఈ జంట మధ్యలో అతగాడు చేరి, వీరు విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యాడు. మరి అతగాడు ఎవరో త్వరలోనే తెలియనుంది.
[…] […]