Samantha : సమంత(Samantha Ruth Prabhu) ని వెండితెర పై చూసి దాదాపుగా రెండుళ్లు కావొస్తుంది. చివరిగా ఆమె విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత మయోసిటిస్ చికిత్స కోసం కొంతకాలం విశ్రాంతి తీసుకొని సినిమాలకు దూరమైంది. కానీ మధ్యలో ‘సిటాడెల్ ‘ అనే వెబ్ సిరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సమంత నుండి ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఈ సినిమా ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
ఇదంతా పక్కన పెడితే నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న ‘రక్ట్ బ్రహ్మాండ'(Rakt Brahmand) అనే వెబ్ సిరీస్ లో సమంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి ఇప్పుడు బ్రేక్ పడిందట. కారణం నిర్మాణం లో పెద్ద స్కాం జరిగిందని నెట్ ఫ్లిక్స్ సంస్థ అనుమానిస్తుందట. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ వెబ్ సిరీస్ నిర్మాణం మొదలైంది. కేవలం 26 రోజుల షూటింగ్ ని మాత్రమే జరుపుకున్న ఈ వెబ్ సిరీస్, అప్పుడే 50 శాతం కి పైగా బడ్జెట్ ని దాటేసిందట. చాలా పెద్ద స్కాం జరిగిందని, దాని వెనుక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హస్తం ఉందని గుర్తించారట. అందులో భాగంగా విచారణ చేసే పనిలో పడడంతో షూటింగ్ కి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ డి2ఆర్ నిర్మాణ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హారర్ ఫాంటసీ లో సమంత విలన్ రోల్ లో నటిస్తుందని సమాచారం. రాజ్ & డీకే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.
డైరెక్టర్ రహి అనిల్ సెట్స్ లో అప్పటికప్పుడు కథలో చేస్తున్న మార్పులు చేర్పుల కారణంగానే నిర్మాణ వ్యయం పెరుగుతుందని సమాచారం. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ మంచి సబ్జెక్టు పై ఎంత ఖర్చు చేయడానికైనా సిద్దమే. కానీ కమిటీకి కనిపించని స్థాయిలో దుబారా ఖర్చులు జరిగాయని గుర్తించారట. ప్రస్తుతం ఈ లొసుగులన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్(Adithya Roy Kapoor), వామిక గబ్బి(Wamika Gabbi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్, ఓటీటీ హిస్టరీ లోనే ఇప్పటి వరకు చూడని కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. ‘తుంబాడ్’ వంటి సంచలనాత్మక సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. 10 ఎండ్రకుల్లా, సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మ్యాన్ 2 వంటి ప్రాజెక్ట్స్ లో విలన్ గా నటించిన సమంత మరోసారి ఈ వెబ్ సిరీస్ లో విలన్ రోల్ లో కనిపించబోతుండడం ఆసక్తిని రేపుతున్న అంశం.