Naga Chaitanya- Samantha: సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వారిలో సమంత – నాగ చైతన్య జంట కూడా ఉంటుంది..ఏ మాయ చేసావే సినిమా ద్వారా పరిచయం అయిన వీళ్లిద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెద్దల సమక్షం లో పెళ్లి కూడా చేసుకున్నారు..అంత సజావుగా సాగుతుంది అని అనుకునేలోపు ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..వీళ్లిద్దరి విడిపోయారు అనే వార్త ని ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..విడాకులు తీసుకొని ఏడాది సమయం గడుస్తున్నా కూడా ఇప్పటి ఈ ఇద్దరి జంట కి సంబంధించిన ఎదో ఒక్క వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..ఇప్పుడు లేటెస్ట్ గా నాగ చైతన్య కోసం అప్పట్లో సమంత వదులుకున్న ఒక్క సినిమా గురించి సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది..ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటె సమంత వేరే లెవెల్ లో ఉండేది అని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ‘జవాన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అయితే తొలుత ఈ సినిమా లో హీరోయిన్ గా సమంత ని అనుకున్నాడు అట డైరెక్టర్ అట్లీ..ఆమెకి ఈ పాత్ర ని వివరిస్తున్నప్పుడు నాగ చైతన్య కూడా అక్కడే ఉన్నాడట..ఆయన నీకు ఈ రోల్ సూట్ అవ్వద్దు..ఈ సినిమా చెయ్యకు అని సలహా ఇవ్వడం తో సమంత ఈ సినిమాకి నో చెప్పింది అని టాక్ వినిపిస్తుంది..దీనితో ఆ ఛాన్స్ ని తమిళ స్టార్ హీరోయిన్ నయనతార కొట్టేసింది..షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతులు వేస్తారు..తమ రోల్ ఎంత అనేది కూడా చూడరు..అలాంటిది సమంత అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఎలా వదులుకుంది అంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు..ఇక టీజర్ చూసిన తర్వాత అందరికి అర్థం అయ్యింది ఏమిటి అంటే ఈ సినిమా షారుక్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని.

అలాంటి సినిమాలో సమంత హీరోయిన్ గా చేసి ఉంటె బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా దూసుకుపొయ్యేది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ దేనికైనా లక్ కలిసి రావాలి అంటారు..సమంత కి ఈసారి ఆ లక్ కలిసి రాలేదు అనుకోవడమే!..ప్రస్తుతం ఆమె క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తో ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తుంది..భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై సమంత చాలా ఆశలే పెట్టుకుంది..ఈ మూవీ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించింది..ఈ సినిమా తో పాటుగా ఆమె ‘యశోద’ అనే సినిమా కూడా చేస్తుంది..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేసారు..వీటితో పాటు ఆమె హాలీవుడ్ లో కూడా రీసెంట్ గా ఒక్క సినిమాని ఒప్పుకుంది..బై సెక్సువల్ నేపథ్యం లో సాగే ఈ సినిమాలో సమంత క్యారక్టర్ చాలా కొత్తగా ఉంటుంది అట..ఇలా విడాకులు తర్వాత చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది సమంత.
Also Read: Ram Charan Driver Birthday Celebrations: రామ్ చరణ్ గొప్పోడబ్బా… డ్రైవర్ కోసం ఏం చేశాడో చూడండి!

[…] […]