Samantha: సమంత గురించి ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ లను అందుకున్నాయి. అత్తారింటికి దారేది సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన నటించి మరిన్ని హిట్ లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు పుష్కర కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించి ప్రస్తుతం ఇండస్ట్రీకి కొంతకాలం పాటు విరామం ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
సమంత సినిమా ఇండస్ట్రీకి విరామం ఇవ్వడానికి కారణం లేకపోలేదు. ఈమె మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసమే కొన్ని నెలల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు సమంత. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్ వివిధ దేశాలకు వెళ్తూ సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ప్రస్తుతం అమ్మడు ఆరోగ్యం కాస్త కుదుటపడిందని తెలుస్తోంది. దీంతో ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్దమైందట.
సమంత పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమౌతోంది. ఇక చివరగా ఈమె రాజ్ అండ్ డి కె దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటించిన సిటాడెల్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నా కూడా కొన్ని పనులు అలాగే మిగిలిపోయాయి. అయితే సమంత ప్రస్తుతం కాస్త కోలుకోవడంతో తిరిగి ఈమె తన సినిమా పనులలో బిజీ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవకపోయినా.. కమిట్ అయిన సిటాడెల్ సిరీస్ కి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు.
సమంత డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ 22 నెలల తర్వాత అంటూ క్యాప్షన్ పెట్టారు. అంటే దాదాపు రెండు సంవత్సరాలు తర్వాత డబ్బింగ్ చెప్పడంతో సమంత ఆరోగ్యం పూర్తిగా నయం అయిందని అందుకే సినిమాలపై ఫోకస్ పెట్టారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.