Budget 2024: అమెరికన్ ఫెడరల్ మార్కెట్ వడ్డీరేట్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు అమలు చేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లలో డాలర్, యెన్, యూరో కరెన్సీలు మినహా మిగతావేవీ లాభ పడలేదు. దీనికి తోడు అమ్మకాల జోరు కొనసాగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయా స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. అయితే ఈ ప్రభావం మన దేశంలోని బీఎస్ఈ, నిఫ్టీ మీద బాగానే చూపించింది. విదేశీ మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో దేశీయంగా చాలా కంపెనీలు నష్టాలు నమోదు చేశాయి. ఈ క్రమంలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో లాభాలు నమోదు అయ్యాయి.
గురువారం ఉదయం 9 గంటల 17 నిమిషాలకు బీ ఎస్ ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 71, 800 , ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 14 పాయింట్ల పెరుగుదలతో 21,739 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. తొమ్మిది గంటల 34 నిమిషాలకు బీ ఎస్ ఈ ఇండెక్స్ 247 పాయింట్ల లబ్ది పొందింది.. ఆ తర్వాత నష్టాల్లో కూరుకుపోయింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ సైతం 21, 788 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. సుమారు 21 , 700 పాయింట్ల వద్ద ఊగిసలాటలో ఉంది. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో బుధవారం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. గురువారం మార్కెట్లు లాభాల్లోకి వస్తాయి అనుకుంటే.. ఈరోజు కూడా ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్_30 సూచీలో దేశీయ దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల స్టాకులు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, విప్రో, ఐటీసీ, నెస్ట్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టాటా స్టీల్, జే ఎస్ డబ్ల్యూ స్టీల్ వంటి కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ పై 81.71 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే మధ్య ఆసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో ధనుడు తగ్గే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు వడ్డీరేట్లను అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ తగ్గించకపోవడంతో. అక్కడి మార్కెట్లు కూడా చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. దీనికి తోడు ఫారెస్ట్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ 83 రూపాయల రెండు పైసల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల తయారీకి ఉపయోగించే భాగాలపై సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో ఒక్కసారిగా ఆ కంపెనీల షేర్లు పెరిగాయి. అయితే వివిధ పరిశ్రమలకు సంబంధించి ఉద్దీపనకు కేంద్రం తోడ్పాటు అందిస్తే మార్కెట్లో అమ్మకాల ర్యాలీ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.