Samantha Remuneration: పర్సనల్ లైఫ్ పక్కనబెడితే.. సినిమా జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది సమంత. తెలుగులో సాధారణ హీరోయిన్ గా ఉన్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. వరుస అవకాశాలు తెచ్చుకుంటూ బీజీ లైఫ్ లో గడుపుతోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది శామ్. ఈ తరుణంలో ఆమె గురించి ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లోనూ దూసుకుపోతున్న ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ బాగా పెంచేసిందట. అంతకుముందున్న పారితోషికాన్ని ఇప్పుడు డబుల్ వసూలు చేస్తోందట. దీంతో ఈ భామతో సినిమాలు తీయడానికి కొందరు నిర్మాతలు జంకుతున్నారు.

‘ఏమాయ చేశావే’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన సమంత మొదట్లో సాధారణ హీరోయిన్ గానే కొనసాగింది. కొన్ని సినిమాల్లో రెండో హీరోయిన్ గా చేయడంతో ఈ ముద్దుగుమ్మ పని అంతేననుకున్నారు.కానీ ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో శామ్ రేంజ్ విపరీతంగా పెరిగింది. ఈ సినిమా తరువాత సమంతకు కోలీవుడ్, మాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో నటించింది. ఓ వైపు సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీసుల్లోనే శ్యామ్ కు మంచిగుర్తింపు రావడంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి.
వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా శ్యామ్ ప్రతీ సినిమాలో నటిస్తోంది. అయితే తనకు వచ్చిన క్రేజ్ లో భాగంగా తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట. అంతకుముందు తెలుగు సినిమాల్లో నటించినప్పుడు సమంత ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకునేదట. ఇప్పుడు అమ్మలు రేంజ్ పెరిగిపోయింది. దీంతో ఆమె పారితోషికం పెరిగింది. దీంతో బాలీవుడ్లో ఒక్కో సినిమాకు ఆమె రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు వసూలు చేస్తోందట. శామ్ రేటు పెరగడంతో కొందరు బాలీవుడ్ నటీమణులు షాక్ తింటున్నారట.

ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద వంటి సినిమాల్లో బిజీగా ఉన్నారు. అటు విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చేస్తున్నారు. దీంతో మరో మూడేళ్ల వరకు సమంత డేట్స్ కూడా దొరికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు సమంత మళ్లీ రెమ్యూనరేషన్ పెంచకముందే సినిమాల కోసం ఆమె డేట్స్ తీసుకుంటున్నారు. ఏదీ ఏమైనా అమ్మడు రేంజ్ ఇంతింతై వటుడింతై అన్నట్లు రెమ్యూనరేషన్ పెరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.