Samantha Movie Update: అతనితో 21న సమంత పూజ.. 23 నుంచి రొమాన్స్ !

Samantha Movie Update: సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌ గా ‘సమంత’ నటిస్తుంది. అయితే, తాజాగా ఈ సినిమా లాంచింగ్ గురించి ఓ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ మీ కోసం. ఈ నెల 21న హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానుంది. అలాగే, 23 నుంచి కాశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ ‘మే’ […]

Written By: Shiva, Updated On : April 18, 2022 5:33 pm
Follow us on

Samantha Movie Update: సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌ గా ‘సమంత’ నటిస్తుంది. అయితే, తాజాగా ఈ సినిమా లాంచింగ్ గురించి ఓ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ మీ కోసం. ఈ నెల 21న హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానుంది. అలాగే, 23 నుంచి కాశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Samantha

మొదటి షెడ్యూల్ ‘మే’ ఫస్ట్ వీక్ వరకూ జరగనుంది. మొదటి షెడ్యూల్ లో విజయ్‌ దేవరకొండ – సమంత పై రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సామ్ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా నటించడానికి అంగీకరించింది. మొత్తానికి సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది.

Also Read: Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కి హైపర్ ఆది గుడ్ బై

ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి మళ్ళీ సామ్ ఫామ్ లోకి వస్తోంది అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. పైగా సామ్ – విజయ్ దేవరకొండ గతంలో మహానటిలో కూడా కలిసి జోడీగా నటించారు. అయితే, ఇప్పటి సినిమాకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది.

కశ్మీర్‌ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్‌ స్టోరీ ఇది. ఎలాగూ రొమాంటిక్ లవ్‌ స్టోరీ కాబట్టి.. సామ్ – విజయ్ మధ్య కూడా ఓ రేంజ్ రొమాన్స్ ఉంటుందట. అందుకే, సమంత ఈ సినిమాకి మూడు కోట్లు డిమాండ్ చేసింది. ప్రస్తుతం సమంత మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’లో కూడా నటిస్తోంది.

ఇప్పటికే సమంత ‘శాకుంతలం’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తోంది. ఇక రీసెంట్ గా శాకుంతలం సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సామ్, ఎన్ని సినిమాలు చేస్తున్నా తన కెరీర్ లోనే విజయ్ దేవరకొండ సినిమాను స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది. కారణం ఆమెకు కథ బాగా నచ్చిందట.

Also Read: Telangana Congress: గీత దాటితే వేటే… రేవంత్‌ కాంగ్రెస్ ను గాడిలో పెడుతున్నాడా?

Tags