
ఆదివారం అంటేనే అందరికీ ఇష్టం. వారంలో ఏడు రోజులున్నా… ఆదివారం కోసమే అందరి చూపులు. ఆదివారం వస్తే చాలు తమ ఇష్టాలు తీర్చుకోవాలనుకునే వారు కొందరు అయితే.. కుటుంబంతో సరదాగా తిరగాలనుకునే వారు కొందరు. మరికొంత మంది ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. ఏమైనా ఆదివారం ఆదివారం అంటే ప్రతి ఒక్కరికీ మక్కువే. వారం అంతా పని చేసి అలిసిపోయిన జీవితాలకు కాస్త ప్రశాంతను అదించేదే ఆదివారం.
Also Read : భగ్న ప్రేమికుడు.. ఎన్ఐఏ అధికారిగా మారాడు..!
ఆదివారం ఒక్క రోజు మాత్రమే ఎక్కువమంది సంతోషంగా హాయిగా ఏ చీకూ చింతా లేకుండా గడపాలని భావిస్తారని ఆ మధ్య ఓ సర్వే కూడా సగర్వంగా చాటి చెప్పింది. దీనికి సెలెబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. వీకెండ్ వస్తే సామాన్యులు కంటే కూడా వారే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఆదివారం వస్తే రొటీన్ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని సపరేట్ ప్లానింగ్స్ తో ఎంజాయ్ చేస్తారు. అందుకే అక్కినేని సమంతకు కూడా ఆదివారం అంటే ఎంతో మక్కువ అట. తానూ కూడా ఆదివారం మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుంటానని.. కానీ ప్రస్తుతం అవన్నీ కలలుగానే మిగిలిపోయాయని అంటుంది సమంత.
నిజానికి సమంత ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. అర్భన్ ఫార్మింగ్ అంటూ ఇంటి డాబా మీదే కూరగాయలు పండించేస్తోంది. పైగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వాడాలి అంటుంది. మొత్తానికి ఈ లాక్ డౌన్‌లోనే సమంత మోడ్రన్ రైతుగా మారిపోయి తెగ ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రంగ ప్రవేశం చేసి తన సొంత బ్రాండ్ కోసం నిర్విరామంగా పని చేసుకుంటూ ముందుకు పోతొంది. సాకీ వరల్డ్ పేరిట తన బ్రాండ్ డిజైనర్ దుస్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు తీరిక లేకుండా పని చేస్తోంది.
అలాగే మరోవైపు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ డబ్బింగ్ కూడా చెబుతుంది. మొత్తానికి ఇన్ని పనుల మధ్య తన చిన్న కోరిక కూడా తీరట్లేదట. ఆదివారం కాస్త ప్రశాంతంగా టబ్ బాత్ చేస్తూ చేతిలో మందు పట్టుకుని అలా ఎంజాయ్ చేద్దామనదే తన కోరిక అట. తన పెట్ చేసిన పనికి అన్నీ తారుమారు అయ్యాయని.. తన పెట్ ను చూసుకోవడానికే తనకు సమయం సరిపోవడం లేదని.. ఆ కారణంగా తన ఆదివారం ప్లాన్ కూడా తీర్చుకోలేక పోతున్నానని సమంత చెబుతుంది.
Also Read : సంక్రాంతి పోరులో చిరు, ప్రభాస్ లేనట్లే !