Tollywood Heroines
Tollywood Heroines: ‘ప్రేమకు ఏజ్ తో సంబంధం ఏముంది రా చారి’ అంటూ అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెపుతాడు. నిజమే ప్రేమకు వయస్సుతో అసలు సంబంధమే లేదు. అది రియల్ లైఫ్ లో నిజమే అని అనేకమంది నిరూపించారు. అలాగే రీల్ లైఫ్ లో కూడా ప్రేమకు ఏజ్ సంబంధం లేదని చెబుతూ అనేక మంది హీరోయిన్స్ వయసులో తమకంటే చిన్న హీరోలతో రొమాన్స్ చేశారు.
తాజాగా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అనే సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి నటించింది. వయస్సు ప్రకారం చూసుకుంటే నవీన్ కంటే అనుష్క ‘8 ఏళ్ల’ పెద్దది. మొన్న రీసెంట్ గా వచ్చిన ‘ఖుషి’ సినిమా హీరో హీరోయిన్స్ చూసుకుంటే విజయ్ దేవరకొండ కంటే సమంత వయస్సులో ‘2 ఏళ్ల’ పెద్దది. గతంలో వీళ్లిద్దరు కలిసి ‘మహానటి’ అనే సినిమాలో కూడా కలిసి నటించారు.
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి సమంత ‘అల్లుడు శ్రీను’ అనే సినిమాలో నటించింది. వీళ్లిద్దరి మధ్య దాదాపు ‘ఆరేళ్ల’ ఏజ్ గ్యాప్ ఉంది. ఇదే హీరోతో హీరోయిన్ పూజా హెగ్డే సాక్ష్యం అనే సినిమాలో నటించింది. వాళ్ళిద్దరి మధ్య దాదాపు ‘రెండేళ్లు’ ఏజ్ గ్యాప్ ఉంది. ఇక అక్కినేని నట వారసుడు అఖిల్ కూడా తనకంటే ఏజ్ లో పెద్దయిన హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు.
“మిస్టర్ మజ్ను ” లో నిధి అగర్వాల్ , అక్కినేని అఖిల్ కలిసి నటించారు. హీరో కంటే హీరోయిన్ ‘ఏడాది’ పెద్దది. అదే విధంగా పూజ హెగ్డే తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో కలిసి నటించారు అఖిల్. వారిద్దరి మధ్య ‘మూడేళ్లు’ గ్యాప్ ఉంది. ఇక పద్దెనిమిది ఏళ్ల కు ‘దేవదాస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని కూడా తనకంటే పెద్ద వయస్సు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. దేవదాస్ హీరోయిన్ ఇలియానా హీరో రామ్ కంటే ‘ఏడాది’ పెద్దది.
‘గణేష్’ సినిమా లో హీరోయిన్ కాజల్ తో జతకట్టాడు రామ్. అతని కంటే ఆమె ‘రెండేళ్లు’ పెద్దది. వీళ్ళే కాకుండా స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ , మహేష్ బాబు తమకంటే ఎక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్స్ తో ఆడిపాడారు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో తన పార్టనర్ అయిన నమ్రత తో మహేష్ బాబు ‘వంశీ’ అనే సినిమాలో నటించారు. మహేష్ కంటే ఆమె ‘నాలుగేళ్లు’ పెద్దది. ఇక సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తనకంటే ‘నాలుగేళ్ల’ పెద్దదైన భూమిక తో రొమాన్స్ చేశాడు.