Homeఎంటర్టైన్మెంట్Samantha: ఆ సినిమాను సమంత గుట్టుగా షూట్ చేస్తుందా? డైరెక్టర్ ఎవరంటే?

Samantha: ఆ సినిమాను సమంత గుట్టుగా షూట్ చేస్తుందా? డైరెక్టర్ ఎవరంటే?

Samantha: సమంత డిజిటల్ సిరీస్లపై ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఆ విధంగా నేషనల్ వైడ్ రీచ్ రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్. రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించారు. వారి దర్శకత్వంలోనే హనీ బన్నీ సిరీస్ చేసింది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి హనీ బన్నీ రీమేక్. వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. ఈ యాక్షన్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కానీ పెద్దగా ప్రేక్షకులను నుండి ఆదరణ దక్కలేదు.

ముచ్చటగా మూడోసారి రాజ్ అండ్ డీకే తో సమంత వర్క్ చేస్తుంది. రక్త్ బ్రహ్మాండ్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. సమంత, ఆదిత్య రాయ్ కపూర్ ఈ సిరీస్ లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. మొన్నటి వరకు ప్రైమ్ కోసం వర్క్ చేసిన రాజ్ అండ్ డీకే.. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా రక్త్ బ్రహ్మాండ్ రూపొందిస్తున్నారు. ఇక తెలుగులో సమంత చివరి చిత్రం ఖుషి. 2023లో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యావరేజ్ గా నిలిచింది.

కొన్ని నెలల క్రితం సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదల చేసింది. ఎర్ర చీరలో తుపాకీ పట్టుకొని ఉన్న సమంత ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాను ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తుంది. ఇది ఆమె కొత్తగా నెలకొల్పిన ప్రొడక్షన్ బ్యానర్. మా ఇంటి బంగారం మూవీకి డైరెక్టర్ ఎవరు అనేది తెలియదు. సమంత మరో అప్డేట్ కూడా ఇవ్వలేదు. దాంతో అసలు మూవీ ఉందా అటకెక్కిందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మా ఇంటి బంగారం మూవీపై అప్డేట్ ఇచ్చింది. ఆమె ఓ లేడీ ఎంపవర్మెంట్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సమంత గురించి మాట్లాడారు. మా ఇంటి బంగారం మూవీకి పని చేసే ప్రతి ఒక్కరికి సమంత సమాన వేతనాలు ఇస్తుంది. ఆడామగా వ్యత్యాసం లేకుండా చెల్లిస్తుంది. మా ఇద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుందని నందిని రెడ్డి ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ ని గుట్టుగా సమంత పూర్తి చేస్తున్నట్లు అవగతమైంది. అలాగే ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. గతంలో నందిని రెడ్డి సమంత లీడ్ రోల్ లో ఓ బేబీ మూవీ చేసింది. ఇది సూపర్ హిట్ కొట్టింది.

Exit mobile version