Samantha: ‘తగ్గెదేలే’ అంటున్న సామ్.. ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్..!

Samantha: హీరోయిన్ సమంత పెళ్లికి మందు గ్లామర్ విషయంలో ఎక్కడా కూడా హద్దులుదాటి నటించిన సినిమాలు గానీ, సీన్స్ గానీ లేవు. కెరీర్ ప్రారంభంలో ‘ఏం మాయ చేశావే’లో నాగచైతన్య లిప్ లాక్ సీన్లలో నటించిన సమంత ఆ రేంజు ఫార్మమెన్స్ మరే సినిమాలో చేయలేదు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ వంటి టాప్ హీరోలతో కలిసి సమంత నటించినా గ్లామర్ ను  పొదుపుగానే వాడింది. ఎక్కడా బోల్డ్ నెస్ కన్పించదు. పెళ్లి […]

Written By: NARESH, Updated On : December 11, 2021 12:34 pm
Follow us on

Samantha: హీరోయిన్ సమంత పెళ్లికి మందు గ్లామర్ విషయంలో ఎక్కడా కూడా హద్దులుదాటి నటించిన సినిమాలు గానీ, సీన్స్ గానీ లేవు. కెరీర్ ప్రారంభంలో ‘ఏం మాయ చేశావే’లో నాగచైతన్య లిప్ లాక్ సీన్లలో నటించిన సమంత ఆ రేంజు ఫార్మమెన్స్ మరే సినిమాలో చేయలేదు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ వంటి టాప్ హీరోలతో కలిసి సమంత నటించినా గ్లామర్ ను  పొదుపుగానే వాడింది. ఎక్కడా బోల్డ్ నెస్ కన్పించదు.

Samantha

పెళ్లి తర్వాత మాత్రం సమంత కొంచెం డోస్ పెంచినట్లే కన్పించింది. ‘రంగస్థలం’లో క్లివేజ్ షో, ముద్దుసీన్లలో సమంత కన్పించింది. పాత్ర డిమాండ్ మేరకు సమంత అలా చేసింది.  ఇక ఈ మూవీలోని ముద్దుసీన్స్ కేవలం గ్రాఫిక్సే అని ఆ తర్వాత తేలింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ లో సమంత తన నటనతోపాటు బోల్డ్ సీన్స్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకున్నప్పటికీ సమంత నటనకు మంచి పేరు వచ్చింది. అయితే ఈక్రమంలోనే సమంత-నాగచైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. ఎవరికీ వారు తమ సినిమాలతో బీజీగా ఉంటున్నారు. చైతు ‘లవ్ స్టోరీ’తో రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టాడు. సమంత సైతం వరుస సినిమాలతో బీజీగా ఉంటోంది. ‘శకుంతలం’ మూవీలో నటిస్తున్న ‘సామ్’ పలు బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్పింది.

తాజాగా ‘పుష్ప’లో ఓ స్పెషల్ సాంగులో సమంత మెరిసింది. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగిపోయే ఐటమ్ సాంగులో సమంత ఓ రేంజులో గ్లామర్ ను చూపించింది. పెళ్లికి ముందే ఎప్పుడూ కూడా ఐటమ్ సాంగ్ లో నటించని సమంత తొలిసారి ‘పుష్ప’లో నటించింది. తన తొలి ఐటమ్ స్పెషల్ సాంగ్ తోనే సమంత కుర్రకారును కట్టిపాడేసింది.

కేవలం లిరికల్ సాంగ్ లోనే సమంత గ్లామర్ చూసిన కుర్రకారు హీటెక్కిపోతున్నారు. దీంతో సినిమాలోని అసలు సాంగ్ కోసం వారంతా వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలోనే సమంత హాట్ ఫార్మమెన్స్ పై ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.

చైతూతో విడిపోయిన సమంత స్వేచ్ఛగా సినిమాలు చేస్తుందనే కామెంట్స్ విన్పిస్తోంది. తనపై ఎవరి అజమాయిషీ లేకపోవడంతో సమంత గ్లామర్ హద్దులను సైతం చేరిపివేస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా సమంత ఐటమ్ సాంగ్ మాత్రం ‘పుష్ప’కు స్పెషల్ అట్రాక్షన్ గా మారిందనే చెప్పొచ్చు.