
Samantha: సమంత (Samantha) ఇప్పుడు బయటకు రావడానికి బాగా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా తెలుగు నెటిజన్లకు అలాగే టాలీవుడ్ మీడియాకీ బాగా దూరంగా ఉంటుంది. కారణం ఒక్కటే… చైతుతో సామ్ విడిపోనుంది అనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఈ వార్తకు సరైన సమాధానం చెప్పే స్థితిలో లేదు సమంత. అందుకే సైలెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీకి ఇచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోవాలని నిర్ణయించుకుంది.
సమంత తాజాగా ఒక బాలీవుడ్ సినిమాకి సైన్ చేసింది. నిజానికి గతంలో సమంతకు కొన్ని బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ అప్పుడు సమంత హిందీ చిత్రాల పై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం హిందీ సినిమాలే నా ప్రధాన టార్గెట్ అంటుంది. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వల్ల సమంతకి బాలీవుడ్ లో కొంత క్రేజ్ వచ్చింది.
కానీ, అది ఒక వెబ్ సిరీస్. పైగా ఆ సిరీస్ లో సమంత పాత్ర హీరోయిన్ పాత్ర కాదు. మరీ ఇప్పుడు సామ్ కి హిందీలో హీరోయిన్ ఆఫర్లు వస్తాయని ఊహించలేం. మొత్తానికి సైడ్ పాత్రలు వచ్చినా సమంత హిందీ సినిమాలను వదులుకునేలా లేదు. ఎలాగూ బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రస్తుతం దక్షిణాది తారల పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ – అట్లీ కలయికలో రూపొందే సినిమాలో కూడా నయనతారనే హీరోయిన్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి అయితే సమంత ఖాళీనే. తెలుగులో ‘శాకుంతలం’ సినిమా మాత్రమే చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్ రెడీ అయిపోయింది. ఇక తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో సమంత కనిపించబోతుంది.
ఈ సినిమా షూటింగ్ కూడా సమంత పూర్తీ చేసింది. అందుకే తన ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది.