Pawan Kalyan Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి రంగంలోకి దిగితే ఎలాంటి విప్లవం వస్తుందో ‘భీమ్లానాయక్’ మూవీతో చూశాం. పవన్ ను కరెక్ట్ గా వాడుకొని సినిమా తీయాలే కానీ.. ఒక వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి మూవీలు వచ్చేస్తుంటాయి. అందులో ఒక చిన్నపాటి సందేశం.. సమాజశ్రేయస్సు కూడా ఇమిడి ఉంటుంది. పవన్ లోని పౌరుషం, కసిని ఈ రెండు సినిమాలు బాగా ఎలివేట్ చేశాయి.
పవన్ కళ్యాణ్ కేవలం భీమ్లానాయక్ తోనే ఆగిపోలేదు. తర్వాత వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. వాటి అడ్వాన్సులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ వచ్చిన డబ్బును వృథా చేయకుండా భూములపై పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.
Also Read: విజయ్ దేవరకొండతో సమంతను కలుపుతున్న మైత్రి
సినిమాల్లో సంపాదించిన వారికంటే ఆస్తులు పోగొట్టుకొని నిండా మునిగిన వారే ఎక్కువ. ఒక్క సినిమా ఫ్లాప్ తో నడిరోడ్డున పడ్డ వారు ఎందరో.. చాలా మంది హీరోలు, నటులు, ఆర్టిస్టులు ఇలా దగా పడ్డవారే. ఉదయ్ కిరణ్ అయితే అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతదాకా ఎందుకు రాంచరణ్ తో సినిమా తీసి ఇదే పవన్ కళ్యాణ్ అన్నయ్య ‘నాగబాబు’ నిండా మునిగి ఒకనొక దశలో ఆత్మహత్య ఆలోచనలు చేశాడని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.
అందుకే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని అందరూ తాము సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములు, ఆస్తులపైనే పెట్టుబడి పెడుతున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ శివారులో నాలుగు ఎకరాలు కొన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్ లోని ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి చెందుతున్న ఖ్వాజాగూడాలోని అత్యంత విలువైన స్థలాన్ని రూ.20 కోట్లకు కొన్నట్టు టాక్. పిల్లల భవిష్యత్తు కోసమే పవన్ ఈ మంచి పనిచేశారని సమాచారం.
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇదివరకూ వచ్చిన డబ్బుతో హైదరాబాద్ లో ఒక ఇల్లు, ఫాంహౌస్ కట్టుకున్నారు. ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలోనే పవన్ ఉంటారు. ఇప్పుడు తను సంపాదించిన డబ్బును ఆస్తులపై పెట్టి ఒక మంచి పనిచేస్తున్నారని చెప్పొచ్చు. మురళీ మోహన్ లాంటి నటులు ఈ భూములపై పెట్టుబడి పెట్టి ఇప్పుడు అత్యంత ధనవంతుడైన సినీ ప్రముఖుడిగా ఉన్నారు. చాలా మంది సినీ నటులు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు పవన్ సైతం వారి బాటలోనే నడిచాడు.
Also Read: జూ.ఎన్టీఆర్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ చేసిన పని ఇదీ!