Samantha romances with boyfriend: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) పేరు సోషల్ మీడియా లో వినపడని రోజంటూ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగచైతన్య(Akkineni Naga Chaitanya) తో విడిపోయినప్పటి నుండి ఈమె పై వచ్చినన్ని ఆర్టికల్స్ దేశం లో ప్రధాన మంత్రికి కూడా వచ్చి ఉండదు. ముఖ్యంగా ఈమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే ఫోటోలు, స్టోరీలు, రీల్స్ కి నెటిజెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గత కొంతకాలం నుండి ఈమె ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుంది అనే వార్త ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. ఇది నిజమా, కాదా అని ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ తనవైపు నుండి ఇవ్వలేదు సమంత. ఇంకా ఆ రూమర్స్ కి బలాన్ని చేకూర్చే విధంగానే ఆమె ప్రవర్తిస్తూ వచ్చింది. శుభం సినిమా విడుదల సమయం లో ఈమె రాజ్ తో కలిసి తిరుమల కి రావడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఆ తర్వాత వీళ్ళు ఎన్నో సందర్భాల్లో క్లోజ్ గా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుంటూ తిరిగారు. వాళ్ళు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి పెద్ద క్వశ్చన్ మార్క్. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి దుబాయి కి వెళ్లారు. ప్రముఖ డిజైనర్ క్రెషా బజాజ్ ఫ్యాషన్ షో జరుగుతుండడంతో, ఆమె అక్కడికి వెళ్లి ఒక వీడియో ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నా రీసెంట్ దుబాయి ట్రిప్ ని ఒక్క నిమిషం లో చూపిస్తున్నా అంటూ సమంత షేర్ చేసిన ఆ వీడియో లో ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని సందడి చేసింది. ఆ వ్యక్తి కచ్చితంగా రాజ్ అయ్యుంటాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి, ఇకనైనా ఓపెన్ అయిపోవచ్చు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సమంత, రాజ్ రిలేషన్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదలైంది. ఈ వెబ్ సిరీస్ కి రాజ్ ఒక దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సమంత ని ఆయన క్రూరమైన లేడీ విలన్ గా చూపించాడు. అప్పటి నుండి మొదలైన వీళ్లిద్దరి రిలేషన్ కాలం గడిచే కొద్దీ ప్రేమగా మారి, ఇప్పుడు ఒకరికోసం ఒకరు బ్రతికే రేంజ్ కి చేరింది. వీళ్లిద్దరు అధికారికంగా పెళ్లి చేసుకోవాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ఆమె తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో పాటు తన ప్రియుడు రాజ్ తెరకెక్కిస్తున్న నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
View this post on Instagram