Samantha: ఆ రెండేళ్ల బాధను బయటపెట్టిన సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఒకవైపు నా ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు నా వివాహ బంధం ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలకు ప్రేక్షకాదరణ కూడా లభించలేదని కామెంట్ చేసింది సమంత.

Written By: Suresh, Updated On : November 9, 2023 3:39 pm

Samantha

Follow us on

Samantha: సమంత సినిమాల ద్వారానే కాదు తన వ్యక్తిగత వివరాల గురించి కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక ఈమె చేసే పోస్టుల వల్ల మరింత వైరల్ అవుతుంటుంది సామ్. నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత ఏ రేంజ్ లో ట్రోల్ కి గురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి ద్వారా బాధ పడింది సమంత. ఇక ఇప్పుడు ఈమె వ్యక్తిగత జీవితం గురించి మరో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వివరాలు మీకోసం…

ఒకవైపు నా ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు నా వివాహ బంధం ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలకు ప్రేక్షకాదరణ కూడా లభించలేదని కామెంట్ చేసింది సమంత. ఇలా ఎంతో బాధ పడ్డానని.. రెండేళ్ల నుంచి ఈ విధమైన బాధను ఎదుర్కొంటూ కుంగుబాటుకు లోనయ్యాను అంటూ సామ్ రాసుకొచ్చింది. అయితే అదే సమయంలో మిగితా నటీనటుల గురించి చదివిందట. ఆ నటీనటుల ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకుందట. వాళ్లు ఏ విధంగా ట్రోల్స్ కి ఎదుర్కొన్నారో కూడా కనుక్కొందట.

ఇలా ఇతర నటీనటుల గురించి తెలుసుకోవడం ఎంతగానో సహాయపడిందని.. వారు చేయగలిగినప్పుడు నేను చేయలేనా అనే ధైర్యం వచ్చిందట. అదే తనకు బలాన్ని ఇచ్చిందంటూ పేర్కొంది సమంత. ఒక నటిగా గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. అదొక అందమైన బహుమతి అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో నిజాయితీగా ఉంటానని.. సెలబ్రెటీల జీవితాలు అంటే ఫలితాలు, అవార్డులు వాళ్ల దుస్తులు మాత్రమే కాదని వారికి కూడా కష్టాలు, బాధలు ఉంటాయని వెల్లడించింది.