Chaitanya Samantha Divorce: అక్కినేని నాగచైతన్య, సమంత లు విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల సంసారంలో ఎలాంటి చికాకులు లేకపోయినా విడిపోయేంత కారణాలు కూడా ఏం లేవనే తెలుస్తోంది. కానీ ఎందుకో ఇద్దరు సామాజిక మాధ్యమాల వేదికగానే తాము విడిపోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఏ మాయ చేశావె సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత వరుస విజయాలతో దూసుకుపోతోంది. నాగచైతన్య కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తాను కూడా మంచి స్థానంలోనే నిలిచారు.

ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య అభిప్రాయ బేదాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇద్దరిలో ఎడం పెరిగిపోయినట్లు చెబుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికగా తాము విడిపోతున్నట్లు చెప్పారు. ఈ విషయం జాతీయ స్థాయిలో సంచలనం అయింది. దీంతో జాతీయ మీడియా సైతం వీరి విడాకుల పర్వంపై పలు కథనాలు ఇచ్చింది.
ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కినేని కుటుంబం సమంతకు రూ. కోట్లలో భరణం ఇచ్చేందుకు సిద్ధపడినట్లు పలు వార్తలు హల్ చల్ చేశారు. నాలుగేళ్లుగా సంప్రదాయబద్ధంగా సంసారం చేసినా ఇప్పుడు విడిపోవడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంగ్ల దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్ మాత్రం ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం సమంతకు రూ.100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు భరణంగా ఇస్తుందని వెల్లడించింది. దీనిపై సమంత మాత్రం తనకు డబ్బులు అవసరం లేదని తెగేసి చెప్పినట్లు తెలిపింది. దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సమంత, నాగచైతన్య వ్యవహారం వార్తల్లో సంచలనం అయిపోతోంది. మొత్తానికి అక్కినేని నాగచైతన్య, సమంత ల ప్రేమకథ మధ్యలోనే ముగిసిపోవడం బాధాకరమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.