Sai Dharam Tej: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఇన్నాళ్లు బోలెడు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అతడు కోమాలో ఉన్నాడని గత రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మెగా అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఇక కొండపొలం ప్రమోషన్ లో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మాత్రం అన్నయ్య కోలుకుంటున్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ఆస్పత్రి బెడ్ పై నుంచే ట్వీట్ చేసి మెగా అభిమానులకు గొప్ప శుభవార్త చెప్పారు. ట్విట్టర్ లో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ‘మీరు నాపై నా సినిమా ‘రిపబ్లిక్’ మూవీపై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరి ముందుకు త్వరలోనే వస్తా’ అని ట్వీట్ చేశాడు. దీంతో సాయిధరమ్ తేజ్ సేఫ్ అన్న సంగతి అభిమానులకు అర్థమైంది. దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బైక్ రైడింగ్ అంటే ఆసక్తి చూపించే సాయిధరమ్ తేజ్ స్పోర్టస్ బైక్ నడుపుతూ మాదాపూర్ తీగల వంతెనపైనుంచి వెళుతుండగా ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతోపాటు ఛాతి భాగంలో ఎముకలు విరిగి తీవ్రగాయాలయ్యాయి.
ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్ బోన్ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయలేవీ లేవని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆపరేషన్ కూడా చేశారు. చాలా రోజులు కోమాలో ఉన్న సాయిధరమ్ కోలుకున్నాడని తెలుస్తోంది. తాజాగా చేసిన ట్వీట్ తో అది నిరూపితమైంది.
https://twitter.com/IamSaiDharamTej/status/1444637180874276867?s=20