Samantha: స్టార్ హీరో వద్ద రూ. 25 కోట్ల అప్పు..? ఫైనల్లీ నోరు విప్పిన సమంత!

మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత దాని నుండి కొంచెం రిలీఫ్ దొరకగానే తాను కమిట్ అయిన సినిమాల షాట్ పూర్తి చేసుకుంది.

Written By: Shiva, Updated On : August 5, 2023 4:51 pm

Samantha

Follow us on

Samantha: ఏ మాయ చేసావె సినిమాతో వెండితెరకు పరిచయమైన సమంత అనతి కాలంలో స్టార్ అయ్యింది. అక్కినేని వారసుడు నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, అనుకోని కారణాల వలన చైతూ నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఆమెకు ఆరోగ్య పరమైన సమస్యలు చుట్టుముట్టడంతో కొన్ని రోజులు సినిమాలకు కూడా దూరంగా ఉంది.

మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత దాని నుండి కొంచెం రిలీఫ్ దొరకగానే తాను కమిట్ అయిన సినిమాల షాట్ పూర్తి చేసుకుంది. మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టడం తో దాన్ని పూర్తిగా తగ్గించుకునే పనిలో పడింది దీంతో సినిమాలకు మరోసారి దూరమైనా సమంత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆమె ట్రీట్మెంట్ కు దాదాపు 25 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ అమౌంట్ మొత్తం టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో గా అప్పుగా తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

తాజాగా వీటిపై సమంత మాట్లాడుతూ “మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా !? ఇది తప్పు.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ చికిత్స కు అయ్యే ఖర్చు నా సంపాదనలో కొంచం మాత్రమే అవుతుంది. ఆ ఖర్చు నేను భరించగలను. నా కెరీర్ లో సంపాదించుకుంది మొత్తం దీని కోసమే ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమే. వేలాది మంది ప్రజలు కూడా దీంతో బాధ పడుతున్నారు. ఇలాంటి విషయాలపై చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యత గా ఉండాలి ” అంటూ తెలిపింది సమంత.

నిజానికి ఎన్నో ఏళ్లుగా అగ్ర కథానాయికగా చలామణి అవుతున్న సమంత కు డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. అలాంటి సమంత కు అప్పు చేయాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆమె మీద వస్తున్న ఇలాంటి రూమర్స్ ని నమ్మాల్సిన పని లేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఖుషి సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత సమంత ఎలాంటి సినిమాలకు సైన్ చేయకుండా చికిత్స కోసం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది